చంద్రబాబు కేసులో మా వాదనలు వినాలి: సుప్రీంలో ఏపీ సర్కార్ కేవియట్ పిటిషన్

By narsimha lode  |  First Published Sep 28, 2023, 4:47 PM IST

చంద్రబాబు కేసులో ఏపీ సర్కార్  కేవీయట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ లో తమ వాదనలు కూడ వినాలని ఏపీ సర్కార్ ఈ పిటిషన్ ను దాఖలు చేసింది. 



అమరావతి: చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ లో తమ వాదనలు కూడా వినాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో గురువారంనాడు కేవీయట్ పిటిషన్ దాఖలు చేసింది.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్  డెవలప్ మెంట్ కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని, రిమాండ్ రద్దు చేయాలని  ఏపీ హైకోర్టులో చంద్రబాబు  క్వాష్ పిటిషన్ ను దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు ఈ నెల 22న కొట్టివేసింది.

దీంతో సుప్రీంకోర్టులో  స్పెషల్ లీవ్ పిటిషన్ ను చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై  సుప్రీంకోర్టులో  నిన్న విచారణ ప్రారంభమైంది. అయితే  సుప్రీంకోర్టు బెంచ్ లో ఎస్‌వీఎన్ భట్ మాత్రం నాట్ బి ఫోర్ మీ అని ప్రకటించారు. దీంతో ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్  దృష్టికి తీసుకెళ్లారు.  దీంతో  ఈ కేసును ఆగస్టు 3వ తేదీన విచారణ చేయనున్నట్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రకటించారు. అయితే ఇదిలా ఉంటే చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్తర్వులు ఇచ్చే ముందు తమ వాదనను కూడ వినాలని ఏపీ ప్రభుత్వం కోరుతుంది.ఈ మేరకు సుప్రీంకోర్టులో కేవీయట్ పిటిషన్ దాఖలు చేశారు.ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో  చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు ఈ నెల 9వ తేదీన  అరెస్ట్ చేశారు.  ఈ కేసులో  చంద్రబాబు వచ్చే నెల  5వ తేదీ వరకు  జ్యుడిషీయల్ రిమాండ్ లో ఉన్నారు. 

Latest Videos

undefined

also read:సర్వీస్ రూల్స్ అతిక్రమిస్తున్నారు:ఏపీ సీఐడీ చీఫ్ పై అమిత్ షాకు టీడీపీ ఫిర్యాదు

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు పాత్రపై ఆధారాలున్నాయని  ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. విద్యార్థులకు శిక్షణ పేరుతో నిధులను దారి మళ్లించినట్టుగా ఏపీ సర్కార్ చెబుతుంది.ఈ విషయమై షెల్ కంపెనీల ద్వారా నిధులు మళ్లించారని ఏపీ సీఐడీ అభియోగాలు మోపింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో పాటు ఏపీ ఫైబర్ గ్రిడ్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ , అంగళ్లు ఘర్షణ కు సంబంధించిన కేసులు  కూడ ప్రస్తుతం చంద్రబాబు చుట్టూ ఉన్నాయి. ఒక కేసు తర్వాత మరో కేసులో పీటీ వారంట్లు వేస్తూ చంద్రబాబును విచారించాలని అధికారులు  ప్లాన్ చేశారు.

click me!