సాక్ష్యాధారాలతోనే చంద్రబాబు అరెస్టు.. టీడీపీకి మాజీ మంత్రి అనిల్ కుమార్ కౌంటర్

By Mahesh Rajamoni  |  First Published Sep 28, 2023, 4:24 PM IST

Amaravati: టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అరెస్టు నేప‌థ్యంలో ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రింత‌గా ముదురుతోంది. జ‌గ‌న్ స‌ర్కారు కావాల‌నే చంద్ర‌బాబు పై కుట్ర చేస్తోంద‌ని టీడీపీ మండిప‌డుతోంది. ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ వైకాపా సైతం ఎదురుదాడికి దిగుతోంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ.. సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేశార‌ని వైకాపా నాయ‌కుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. 
 


Former minister Anil Kumar Yadav: టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అరెస్టు నేప‌థ్యంలో ఏపీలో అధికార‌, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధం మ‌రింత‌గా ముదురుతోంది. జ‌గ‌న్ స‌ర్కారు కావాల‌నే చంద్ర‌బాబు పై కుట్ర చేస్తోంద‌ని టీడీపీ మండిప‌డుతోంది. ఇదే స‌మ‌యంలో అధికార పార్టీ సైతం ఎదురుదాడికి దిగుతోంది. ఈ క్ర‌మంలోనే టీడీపీ ఆరోప‌ణ‌ల‌ను ఖండిస్తూ.. సాక్ష్యాధారాలతోనే చంద్రబాబును అరెస్టు చేశార‌ని వైకాపా నాయ‌కుడు, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

వివ‌రాల్లోకెళ్తే.. చంద్రబాబు అరెస్టుపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు తగిన ఆధారాలు ఉన్నాయని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కేవలం సాక్ష్యాధారాల ఆధారంగానే సీఐడీ చంద్ర‌బాబును అరెస్టు చేసిందని తెలిపారు. అందుకే కోర్టులు సైతం ఆయ‌న‌కు బెయిల్ నిరాకరించాయని స్పష్టం చేశారు. చంద్రబాబు కుంభకోణాలు ఒక్కొక్కటిగా బట్టబయలవుతున్నాయని అనిల్ పేర్కొన్నారు.

Latest Videos

undefined

చంద్రబాబు సీఎంగా ఉన్న స‌మ‌యంలో చాలా స్కామ్ లు చేశార‌ని ఆరోపించారు. ఇప్పుడు ఒక్కొక్క‌టిగా అన్ని బ‌య‌ట‌కు వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. చంద్రబాబు లక్కీ నంబర్ 23 అని, 2019 ఎన్నికల్లో తమ పార్టీ నుంచి 23 మందిని లాక్కుని 23 సీట్లు గెలిచారని అనిల్ ఎద్దేవా చేశారు. ఇదే ల‌క్కీ నెంబర్ అయిన 23వ తేదీన చంద్రబాబు అరెస్టు జరిగిందని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడితే వయసుతో సంబంధం లేకుండా చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అనిల్ స్పష్టం చేశారు. ఎలాంటి నేర‌మైన చ‌ట్టం దృష్టిలో నేర‌మేన‌నీ, భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

అంతకుముందు, అసెంబ్లీ చివరి రోజైన బుధవారం జరిగిన చర్చలో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ పై వైకాపా సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. హెరిటేజ్ ఫుడ్స్, మాజీ మంత్రి పీ.నారాయణ యాజమాన్యంలోని కళాశాలలకు లబ్ధి చేకూర్చేలా ఐఆర్ ఆర్ మాస్టర్ ప్లాన్ ను మార్చారని మాజీ మంత్రి తెలిపారు.

click me!