ఏ శ్రీరెడ్డి ... అబ్బ... అయ్య... అంటూ చించుకున్నావుగా :టిడిపి అమ్మాయిల ర్యాగింగ్ 

Published : Jun 06, 2024, 12:51 PM ISTUpdated : Jun 06, 2024, 01:00 PM IST
ఏ శ్రీరెడ్డి ... అబ్బ... అయ్య... అంటూ చించుకున్నావుగా :టిడిపి అమ్మాయిల ర్యాగింగ్ 

సారాంశం

వివాదాాస్పద నటి శ్రీరెడ్డిని టిడిపి శ్రేణులు ఓ ఆటాడుకుంటున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలిచి తీరతాడంటూ శ్రీరెడ్డి కామెంట్స్ కు ఇప్పుడు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. 

అమరావతి : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ టాలీవుడ్ నటి శ్రీరెడ్డి. సినిమాల్లో ఆమె పొడించిందేమీ లేదు... కానీ వివాదాలే ఆమెను నిత్యం వార్తల్లో నిలిపాయి. సినిమా వాళ్లపై లైంగిక వేధింపుల ఆరోపణలతో శ్రీరెడ్డి వివాదాలు మొదలయ్యాయి. ఆ తర్వాత భారీ ఫ్యాన్ బేస్ కలిగిన పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేసారు. ఇది చాలదన్నట్లు ఇప్పుడు రాజకీయాల్లోనూ తలదూర్చి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రచ్చరచ్చ చేసింది శ్రీరెడ్డి. టిడిపి, జనసేన, బిజెపి కూటమికి వ్యతిరేకంగా...వైసిపికి మద్దతుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఎన్నికల ఫలితాలకు ముందు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపుపై శ్రీరెడ్డి ధీమా వ్యక్తం చేస్తూ సంచలన కామెంట్స్ చేసారు. కానీ వైఎస్ జగన్ ఓటమిపాలవడంతో శ్రీరెడ్డి టిడిపి అనుకూల సోషల్ మీడియాలో ఘోరంగా ట్రోల్స్ కు గురవుతున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ వైసిపి ఓడిపోదని... ఒకవేళ ఓడితే నగ్న ప్రదర్శన చేస్తానని శ్రీరెడ్డి ఛాలెంజ్ చేసింది. అయితే టిడిపి కూటమి చేతిలో వైసిపి ఘోర ఓటమిని చవిచూసిన నేపథ్యంలో ఓ ఇద్దరు టిడిపి అమ్మాయిలు శ్రీరెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు.''ఏమమ్మా శ్రీరెడ్డి... ఎక్కడున్నావ్... మీ జగనన్న ఓడితే నగ్న ప్రదర్శన చేస్తానన్నావుగా. అలా వద్దులేకానీ నీ చితికి నువ్వే నిప్పంటించుకో. అబ్బ... అయ్యా... అని చించుకున్నావుగా... ముందు బయటకు రా'' అంటూ హెచ్చరించారు. 

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాటలు విని మూసుకుని కూర్చున్నాం...  కానీ మేము మీవాళ్లలా సాప్ట్ కాదంటూ శ్రీరెడ్డికి సూచించారు యువతులు. ఇప్పుడు మా నాయకుడు సైలెంట్ గా వుండమన్నా మిమ్మల్ని వదిలిపెట్టం... నీకు, మీ పేటిఎం బ్యాచ్ కు ఇక ర్యాంప్ ఆడిపోద్ది... ఇందుకోసం విఆర్ వేయిటింట్ అంటూ శ్రీరెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చారు యువతులు. ఈ వీడియో టిడిపి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  

 

వైఎస్ జగన్ కు శ్రీరెడ్డి ఓదార్పు :

ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన మాజీ సీఎం, వైసిపి అధినేత వైఎస్ జగన్ కు శ్రీరెడ్డి ఓదార్చారు. వైసిపి ఓటమిపాలైనా మేమంతా జగన్ కు మద్దతుగా వుంటామని అన్నారు. ఓడిపోయాడని జగన్ ను తక్కువ అంచనా వేయవద్దని... అరణ్యం పాలయిన అర్జునుడిలా తిరిగి రాజ్యాన్ని పొందుతాడని అన్నారు. జగన్ పట్టు వదలకుండా ఎంతో చాకచక్యంగా రాజకీయాలు కొనసాగిస్తారని... ఆయనకు అండగా మేమంతా వుంటామని శ్రీరెడ్డి ట్వీట్ చేసారు. 

ఇక మరో పోస్ట్ లో ''బాధపడద్దు.. ఎత్తoడి రా తల,ఎగురయిరా కాలర్ ..ధైర్యంగ నిలబడరా..ప్రజలకు ఏ ప్రభుత్వం ఇవ్వలేనన్ని స్కీమ్స్ ఇచ్చిన జగన్ అన్న తాలూకా అని గర్వంగా చెప్పరా ..జై  వైస్సార్సీపీ'' అంటూ... ఇంకో పోస్టులో ''బాధపడకు  జగన్  అన్న ..క్యాడర్  కి కొత్త ఊపిరి  పొయ్యి .నిలబడు ,పోరాడు..నిన్ను  నమ్ముకున్న  వాళ్ళ  అందరి  కోసం  బలం  తెచ్చుకో ..ఇక రోజు ఒక పోరాటమే..విజయం వున్న వాళ్ళ వైపు జారబడే వాళ్ళు ఎక్కువ..వెక్కిరించే వెదవలు కోసం కాదు ,నీ సైన్యం కోసం పోరాడాలి'' అంటూ జగన్ కు ధైర్యంచెప్పారు శ్రీరెడ్డి. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu