రుషికొండే... జగన్ కు బోడి గుండు కొట్టించిందా..!!

Published : Jun 06, 2024, 11:06 AM ISTUpdated : Jun 06, 2024, 11:17 AM IST
రుషికొండే... జగన్ కు బోడి గుండు కొట్టించిందా..!!

సారాంశం

రుషి కొండను బోడిగుండు కొట్టించిన జగన్ కు విశాఖ ప్రజలు బోడిగుండు కొట్టించారంటూ టిడిపి, జనసేన అనుకూల వర్గాల ట్రోలింగ్ సాగుతోంది. గతంలో పవన్ కల్యాణ్ నురుషికొండకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్న ఘటనను గుర్తుచేస్తున్నారు. 

విశాఖపట్నం :  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన టిడిపి కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి పాలనా బాధ్యతలు చేపట్టనున్నారు. వైసిపి ఓటమితోనే జగన్ సర్కార్ మూడు రాజధానుల కథ ముగిసినట్లే... విశాఖపట్నం, కర్నూల్ లకు రాజధాని లేనట్లే. అమరావతి నిర్మాణం చంద్రబాబు చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్... కాబట్టి ఇప్పుడు రాజధాని అక్కడే కొనసాగించడం ఖాయం. మరి రాజధాని పేరుతో విశాఖ రుషికొండపై నిర్మించిన భవనాల పరిస్థితి ఏమిటి? వాటిని చంద్రబాబు సర్కార్ ఏం చేస్తుంది? అనేది ఆసక్తికరంగా మారింది. 

అయితే రుషికొండపై ప్రకృతిని నాశనం చేసిమరీ భవనాలు నిర్మించారని టిడిపితో పాటు జనసేన కూడా వైసిపి సర్కార్ పై  తీవ్ర ఆరోపణలు చేసారు. ఈ భవనాల చుట్టూ హాట్ హాట్ రాజకీయాలు సాగాయి. జనసేనాని పవన్ కల్యాణ్ రుషికొండపై జరుగుతున్న నిర్మాణాల పరిశీలనకు వెళ్గగా వైసిపి ప్రభుత్వం అడ్డుకుంది. ఇదే ప్రస్తుతం వైసిపి ఘోర పరాభవానికి ఓ కారణమయ్యిందనే చర్చ సాగుతోంది.

 పవన్ ను అడ్డుకోవడంతో రుషికొండ నిర్మాణాలపై మొదలైన రచ్చ ఎన్నికల వరకు సాగింది. ప్రకృతి అందాలతో రమనీయమైన రుషికొండను జగన్ సర్కార్ బోడిగుండు చేసిందంటూ జనసైనికులు, మెగా ఫ్యాన్స్ చేసిన ట్రోలింగ్ ప్రజల్లోకి బాగా వెళ్లింది. రుషికొండ విధ్వంసాన్ని ప్రజలు తెలియచేయకుండా గ్రీన్ మ్యాట్ తో కవర్ చేయడమూ బెడిసికొట్టింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేసాయి.

అయితే వైసిపి హయాంలో విశాఖకు రాజధాని తరలించడానికి ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే సీఎం క్యాంప్ ఆపీస్ కోసమే రుషికొండపై నిర్మాణాలు చేపట్టినట్లు తెగ ప్రచారం జరిగింది. అందువల్లే పర్యాటక శాఖ ఆధ్వర్యంలో భవనాలు నిర్మించినప్పటికీ అత్యంత లగ్జరీ ఏర్పాట్లు చేసినట్లు ప్రచారం జరిగింది. ఇది కూడా జగన్ కు నెగెటివ్ గా మారింది. ఇలా రుషికొండపై నివాసం జగన్ కొంప ముంచింది. 

ఇప్పుడు రుషికొండ భవనాల పరిస్థితేంటి..?

రుషికొండపై ప్రకృతి విధ్వంసం,  భవనాల నిర్మాణాలు ఎన్నికల సమయంలో టిడిపి ప్రచారానికి బాగా ఉపయోగపడ్డాయి. నారా లోకేష్ అయితే టిడిపి అధికారంలోకి రాగానే రుషికొండ భవనాలను ప్రజా భవన్ గా మారుస్తామని ప్రకటించారు. తాడేపల్లిలో చాలదన్నట్లు ఇప్పుడు విశాఖలో రూ.500  కోట్లతో జగన్ విలాసవంతమైన భవనాలను నిర్మించుకున్నాడని... ప్రజాధనంతో ప్రకృతిని నాశనం ప్యాలెస్ ఏర్పాటుచేసుకున్నాడన్నారు.  

అయితే తాజాగా భారీ మెజారిటీతో గెలిచిన టిడిపి అధికారాన్ని చేపట్టనుంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత రుషికొండ భవనాలపై నిర్ణయం తీసుకోనుంది. వైసిపి గెలిచివుంటే రాజధాని విశాఖకు తరలివెళ్ళేది... కాబట్టి రుషికొండపై భవనాలు జగన్ ప్యాలస్ లుగా మారేవి. అందుకోసమే వాటిని అంత లగ్జరీగా నిర్మించారట... మరి వీటిని టిడిపి ప్రభుత్వం చేస్తుంది? ఎలా వాడుకుంటుందో చూడాలి. 

తెలంగాణలో కూడా ఇలాగే కేసీఆర్ ప్రగతిభవన్ ను చాలా లగ్జరీగా కట్టించుకున్నాడు. దీన్ని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రజా భవన్ గా  మార్చింది. మరీ  లోకేష్ చెప్పినట్లుగా రుషికొండ భవనాలను ప్రజాభవన్ గా మారుస్తారేమో చూడాలి. ఇదే జరిగితే శిష్యుడు రేవంత్ రెడ్డిని గురువు చంద్రబాబు నాయుుడు ఫాలో అయినట్లే. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bus Accident : అల్లూరి జిల్లాలో ఘోరం.. బస్సు ప్రమాదంలో 15మంది మృతి
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!