వివేకా హత్యతో విజయమ్మ, షర్మిల జాగ్రత్త... భారీ కుట్రకు సంకేతాలు..: సీఎం జగన్ పై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

Arun Kumar P   | Asianet News
Published : Dec 13, 2021, 01:07 PM ISTUpdated : Dec 13, 2021, 01:22 PM IST
వివేకా హత్యతో విజయమ్మ, షర్మిల జాగ్రత్త... భారీ కుట్రకు సంకేతాలు..: సీఎం జగన్ పై అయ్యన్న సంచలన వ్యాఖ్యలు

సారాంశం

ముఖ్యమంత్రి జగన్ హత్యకు కుట్ర జరుగుతోందన్న వైసిపి నాయకులు వ్యాఖ్యలపై స్పందిస్తూ టిడిపి సీనియర్ నాయకులు  అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేసారు. 

విశాఖపట్నం: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jaganmohan reddy) హత్యకు తెలుగుదేశం పార్టీ (TDP) కుట్రలు పన్నుతోందని అధికార వైసిపి (YSRCP) నాయకులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. మొన్న అనంతపురం జిల్లా రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి (thopudurthy prakash reddy) సీఎం జగన్ ను హతమార్చి టిడిపి అధికారంలోకి రావాలని చూస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇక నిన్న ఉప ముఖ్యమంత్రి (ap deputy cm) నారాయణ స్వామి (narayanaswamy) కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందిస్తూ తనదైన స్టైల్లో ఘాటుగా రిప్లై ఇచ్చారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు (ayyannapatrudu).  

''నిన్న తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి, నేడు ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి గారూ జ‌గ‌న్ రెడ్డి ప్రాణాల‌కు హానిత‌ల‌పెట్టొచ్చ‌ని తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం... మ‌రో కోడిక‌త్తి డ్రామా, బాత్రూమ్ బాబాయ్ గొడ్డ‌లివేటు రిహార్స‌ల్లాగా అనిపిస్తోంది. ఓవైపు అప్పుల‌కుప్ప‌,  మ‌రోవైపు తీవ్ర‌మైన ప్ర‌జావ్య‌తిరేక‌త‌తో... మ‌ళ్లీ కోడిక‌త్తికి సాన‌బెడుతూ, గొడ్డ‌లికి దారుబెడుతున్న సంకేతాలు క‌నిపిస్తున్నాయి'' అని అయ్యన్న పేర్కొన్నారు.

''అబ్బాయ్ గారూ.. ఈ సారి ఏ బాబాయ్‌కి గురిపెట్టారో! తల్లి విజయమ్మ (ys vijayamma(, చెల్లి షర్మిల (ys sharmila) దుర్మార్గుడికి దూరంగా వుంటున్నా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్ వివేకానంద రెడ్డి హత్య (ys vivekananda reddy murder) చెబుతోంది. బురద రాజకీయం మాని హూ కిల్డ్ బాబాయ్ (who killed babai) అనే ప్రశ్నకు వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలి'' అంటూ మాజీ మంత్రి అయ్యన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. 

read more  జగన్ ను చంపి అధికారంలోకి రావాలనే కుట్ర: టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలనం

ఇటీవల వైసిపి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్ర‌కాశ్‌రెడ్డి సీఎం జగన్ ప్రాణాలకు హాని వుందంటూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబులను చంపితే రూ. 50 లక్షలు ఇస్తానని కమ్మ సంఘం నేత మల్లాది వాసు చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ టిడిపి హింసా రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. 

ఈ క్రమంలోనే సీఎం జగన్ హత్యకు టిడిపి కుట్రపన్నుతోందని తోపుదుర్తి సంచనల వ్యాఖ్యలు చేసారు. జగన్ ను తప్పిస్తే గాని అధికారంలోకి రామని టిడిపికి అర్థమయ్యిందన్నారు. దీంతో సీఎంను చంపి టీడీపీ అధికారంలోకి రావాలని చూస్తోందంటూ ఎమ్మెల్యే తోపుదుర్తి సంచలన వ్యాఖ్యలు చేసారు.

read more  Andhra Pradesh: వైకాపా నేత‌ల నాలుక‌లు తెగ్గొయాలంటూ పరిటాల సునిత సంచలన వ్యాఖ్య‌లు

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగుతున్న సమయంలోనే డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కూడా అలాంటి కామెంట్సే చేసారు. సీఎం జగన్ ను అంతమొందించడానికి కుట్రలు పన్నుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. టిడిపి చీఫ్ చంద్రబాబు నుండే జగన్ కు ప్రాణహాని వుందని ఆరోపించారు. 

సీఎం జగన్ తో పాటు మంత్రి కొడాలి నాని (kodali nani), వల్లభనేని వంశీ (vallabhaneni vamshi), అంబటి రాంబాబు (ambati rambabu) హత్యకు కూడా కుట్ర జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి ఆరోపించారు.  చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు చందాలు పోగుచేసి మరీ వీరి హత్యకు డబ్బులు సమకూర్చుకుంటున్నారని నారాయణ స్వామి ఆరోపించారు. చంద్రబాబు కుట్రలను జాగ్రత్తగా గమనిస్తూ... సమయం వచ్చినప్పుడు ఎదుర్కోవాలని వైసిపి శ్రేణులకు మంత్రి సూచించారు. సీఎం జగన్‌కు రక్షణ కల్పించేందుకు ఎల్లపుడూ వైసీపీ కార్యకర్తలంతా సిద్దంగా వుండాలని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పిలుపునిచ్చారు.


 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?
IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో టెంపరేచర్స్ కుప్పకూలడానికి .. చలి బీభత్సానికి కారణమేంటో తెలుసా?