వార‌సత్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకించే మీరు.. సినీ వార‌స‌త్వాల‌కు వ్య‌తిరేకం కాదా? : అంబ‌టి

Published : Dec 13, 2021, 01:02 PM IST
వార‌సత్వ రాజ‌కీయాల‌కు వ్య‌తిరేకించే మీరు.. సినీ వార‌స‌త్వాల‌కు వ్య‌తిరేకం కాదా? : అంబ‌టి

సారాంశం

ప‌వ‌న్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. ప్ర‌ధాని వార‌స‌త్వ  రాజ‌కీయాల‌కు వ్య‌తిరేక‌మ‌ని, ప్ర‌ధాని బాట‌లో న‌డుస్తాని అనే ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రీ సినిమాల‌లో వార‌సత్వాల‌ను వ్య‌తిరేకించారా? అని నిల‌దీశారు. మ‌రి, వార‌స‌త్వ రాజ‌కీయాలు చేసే  చంద్ర‌బాబు తో క‌లిసి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎందుకు ప‌ని చేశార‌ని అంబ‌టి రాంబాబు ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు చేస్తున్న‌ది వార‌స‌త్వ రాజ‌కీయాలు కాదా? అని ఆయ‌న నిల‌దీశారు.  

జ‌న సేనాని ప‌వ‌న్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశాడు. గ‌తంలో మోడీ  ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన ప‌వ‌న్ తాజాగా ఆయ‌న‌ను పొగడ్త‌ల‌తో ముంచేతున్నార‌ని విమ‌ర్శించారు.   ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ప్ర‌స్తుతం సినిమాల్లో కాల్‌షీట్లు లేవేమో..  అందుకు ఎప్పుడూ లేనిదీ  8 గంట‌ల‌ దీక్ష అని మ‌ళ్లీ రాజ‌కీయం చేస్తున్నారు.  ఏపీకి అన్యాయం చేసినా.. కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేని ప‌వ‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వంపై ప‌డి ఏడుస్తున్నారని ప‌వ‌న్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశాఖ‌ స్టీల్‌ప్లాంట్ విష‌యంలో కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించరంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను  నిల‌దీశారు.  పవన్‌ కల్యాణ్‌ ఏ దీక్ష చేసినా..  ఆవుకథనే వల్లెవేస్తున్నారని,  విశాఖ స్టీల్ ప్లాంట్ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిద‌ని గుర్తు చేశారు.ప్రత్యేక హోదాను వెయ్యి అడుగుల గోతిలో పెట్టిన చంద్రబాబు దానిపై మాట్లాడుతున్నారని. ఇవాళ మరొకాయన మరో కొత్త‌ నాటకం ఆడారంటూ పవన్ పై సెటర్లు వేశారు, ప‌వ‌న్ ఏ దీక్ష చేసినా ఆవు క‌థ‌లాగా.. జగన్, వైఎస్సార్‌సీపీ మీదే ఆరోపణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా తమ పార్టీ మీదే పడుతున్నారని చెప్పుకొచ్చారు. 

Read Also:  AP High Court: ఏపీ హైకోర్ట్‌ అదనపు భవనానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా శంకుస్థాపన..

ప్ర‌ధాని మోడీ వార‌సత్వ రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటాడ‌ని..  ఆయ‌న‌తో క‌లిసి తాను ప‌ని చేస్తున్నానంటూ జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నార‌ని అంబ‌టి రాంబాబు గుర్తు చేశారు. మ‌రి, గ‌త ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుతో క‌లిసి.. ప‌వ‌న్  ఎందుకు ప‌ని చేశార‌ని ప్ర‌శ్నించారు. మ‌రీ చంద్ర‌బాబుదీ వార‌సత్వ రాజకీయం కాదా? అని ప్ర‌శ్నించారు.  

వార‌స‌త్వ రాజ‌కీయాల‌ను వ్య‌తిరేకంగా ఉండే మీరు.. సినిమాల్లో వార‌స‌త్వాల‌కు  వ్య‌తిరేకం కాదా? అని నిల‌దీశారు.  ప‌వ‌న్ కూడా వార‌స‌త్వం ద్వారానే రాజ‌కీయాల‌కు, అటు సినిమాల‌కు ఏంట్రీ ఇచ్చాడ‌నీ గుర్తు చేశారు. త‌న ఆర్థిక మూలాలు దెబ్బ‌తీయ‌డానికే సినిమా టికెట్ల విష‌యంలో ఏపీ స‌ర్కారు కొత్త విధానాలు తీసుకొస్తోంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అంటున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. అంద‌రి బాగుకోస‌మే ఏపీ స‌ర్కారు కొత్త విధానాన్ని తీసుకొచ్చింద‌ని , ప్రజలు, నిర్మాతలు కోరినందునే ఆన్ లైన్ టిక్కెట్లు పెట్టామన్నారు. కొందరి కోసం తాము పనిచేయడం లేదని అంబటి స్పష్టం చేసారు. సినిమాలో నటించినందుకు పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేసారు. 

Read also:  Vijayawada: పెళ్లికి ముందే ప్రియుడితో సహజీవనం... మనస్తాపంతో యువతి ఆత్మహత్య

 
చంద్ర‌బాబు సీఎంగా ఉన్న‌ప్పుడూ అమ‌రావ‌తిపై ఒక‌లా.. ఇప్ప‌డూ మ‌రోలా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతున్నార‌ని, ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడే విష‌యాల‌కు, చేసే ప‌నుల‌కు పొంతన లేద‌ని, పవన్ మాట్లాడితే జనం విశ్వసించే ప‌రిస్థితి లేద‌ని అన్నారు. ప‌వ‌న్ .. చంద్రబాబు దుర్మార్గాన్ని ఏ రోజు కూడా ప్ర‌శ్నించ‌లేద‌నీ. కానీ జ‌గ‌న్ చేసే.. మంచిని కూడా చెడుగా భావిస్తున్నార‌ని అన్నారు.   2024లో ఓట్లేయమని అడగటానికే ఇవాళ పవన్ దీక్ష చేస్తున్నార‌నీ, అస‌లు ప‌వ‌న్ కు రాజకీయాలు ఎందుకు? సినిమాలు చేసుకుంటే స‌రిపోతుంది క‌దా? అని అంబ‌టి రాంబాబు సూచించారు.  సినిమాల్లో లాగా.. త‌డాఖా చూపిస్తా అంటే.. రాజ‌కీయాల్లో వ‌ర్క్ అవుట్ కాద‌ని అన్నారు. రాజ‌కీయాలంటే సినిమాలు కాద‌ని   ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ క‌న్ఫ్యూజ‌న్ మాస్ట‌ర్ అని ఆయ‌న ఎద్దేవా చేశారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్