AP High Court: ఏపీ హైకోర్ట్‌ అదనపు భవనానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీకే మిశ్రా శంకుస్థాపన..

By Sumanth KanukulaFirst Published Dec 13, 2021, 12:20 PM IST
Highlights

అమరావతి ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు (Andhra Pradesh High Court) అదనపు భవనాన్ని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన భవన నిర్మాణానికి సోమవారం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Justice Prashant Kumar Mishra) శంకుస్థాపన చేశారు.

అమరావతి ప్రాంతంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు (Andhra Pradesh High Court) అదనపు భవనాన్ని నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించిన భవన నిర్మాణానికి సోమవారం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా (Justice Prashant Kumar Mishra) శంకుస్థాపన చేశారు. ఆయన చేతుల మీదుగా ఉదయం 9.50 గంటలకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోనే హైకోర్టు న్యాయమూర్తులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సీఆర్డీఏ అధికారుల, ప్రభుత్వ న్యాయవాదులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ భవనాన్ని గ్రౌండ్ + 5 అంతస్థులుగా నిర్మించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన నిధులను కూడా ప్రభుత్వం విడుదల చేసింది.

అయితే ప్రస్తుతం ఉన్న ఏపీ హైకోర్టు భవనంలో పూర్తిస్థాయిలో కార్యకలాపాల నిర్వహణకు చోటు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో కోర్టు ఎదురుగా ఉన్న స్థలంలో మరో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే నేడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్  కుమార్ మిశ్రా చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. 

click me!