తిరుపతి ఉప ఎన్నికపై టిడిపి సమీక్ష

By AN TeluguFirst Published Jan 5, 2021, 11:27 AM IST
Highlights

తిరుపతి ఉప ఎన్నిక పై సోమిరెడ్డి నివాసంలో టిడిపి సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. 

తిరుపతి ఉప ఎన్నిక పై సోమిరెడ్డి నివాసంలో టిడిపి సమీక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో టిడిపి అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. 

నియోజకవర్గాలకు బయట నుంచి ఇన్ ఛార్జ్ లను పంపాలని నిర్ణయించారు. 10 బూత్ లకు ఒక ఇన్ ఛార్జ్ ను నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. 

సమావేశంలో ప్రచారం ,గ్రామ పర్యటనలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో నేతలు అందరూ నియమించిన నియోజకవర్గాల్లోనే ఉండాలని  నిర్ణయించారు. 

2019 ఎన్నికల్లో తిరుపతి లోక్‌సభ స్థానం నుంచి గెలిచిన వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాద్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. 

ఏపీలోని తిరుపతితో పాటు తెలంగాణలోని నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఒకేసారి వచ్చే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు. లేకపోతే ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది.
 

click me!