
శాసనమండలి అభ్యర్ధులను ఏకగీవ్రం చేసుకునేందుకు టిడిపి ఒత్తిళ్లకు దిగింది. స్ధానిక సంస్ధల కోటాలో తొమ్మిది ఎంఎల్సీ స్ధానాల భర్తీకి అధికార పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. చాలా చోట్ల వైసీపీకి సరిపడా బలం లేని కారణంగా అభ్యర్ధులను పోటీ పెట్టలేదు. అయితే, పలుచోట్ల స్వతంత్ర అభ్యర్ధులు నామినేషన్లు వేసారు. ఎన్నికల దాకా రాకుండానే తమ అభ్యర్ధులు ఏకగీవ్రంగా ఎన్నికవుతారని టిడిపి అనుకున్నది. ఎప్పుడైతే స్వతంత్రులు పోటీలొకి నిలిచారో అధికార పార్టీకి మండింది. దాంతో వారిపై ఒతిళ్లు మొదలుపెట్టింది. ఈ రోజు నామినేషన్ల స్ర్కూటినీ అయిపోయింది. 3వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంది. ఈ లోగానే టిడిపి అభ్యర్ధులు తొందరపడుతున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో రెండు స్ధానాలకు ఎన్నికలు జరగాలి. అయితే, అధికార పార్టీతో పాటు మరో నలుగురు ఇండిపెండెంట్లుగా నామినేషన్లు దాఖలు చేసారు. స్ర్కూటినీ సమయానికే వారి చేత ఉపసంహరణలకు లేఖలు తీసుకోవాలని టిడిపి వారిపై ఒత్తిళ్లు మొదలుపెట్టంది. అయితే, అభ్యర్ధులు అంగీకరించకపోవటంతో వారికి ప్రపోజర్లుగా సంతకాలు పెట్టిన వారిపై ఒత్తిళ్ళు తెస్తోంది. నామినేషన్ ఫారంలో ఉన్న సంతకాలు తమవి కావని పోర్జరీవని రిటర్నింగ్ అధికారులకు చెప్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఒత్తిళ్ళకు లొంగి చేసిన సంతకాలను ఉపసంహరించుకుంటే ఒక పద్దతి లేకపోతే బెదిరింపులు ఎటూ ఉండనే ఉన్నాయి. అధికారంలో ఉన్నాం, యంత్రాంగమంతా చేతిలో ఉన్నారన్న ధీమాతో బ్లాక్ మైల్ కు సైతం దిగుతోంది. 3వ తేదీ ఉపసంహరణలకు చివరి రోజు కావటంతో అప్పటికి టిడిపి ఇంకెతం దూకుడు ప్రదర్శిస్తుందో చూడాలి.