
గ్యాస్ వినియోగదారులపై కేంద్రం పెద్ద బండ పడేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా సిలిండర్ ధర పెరగటం గమనార్హం. పెరిగిన ధరతో గ్యాస్ వినియోగదారులకు దిమ్మతిరగటం ఖాయం. గృహాల్లో వాడే సిలిండర్ ధరను ఒకేసారి రూ. 90 పెంచింది. ప్రస్తుతం సిలిండర్ ధర రూ. 738 ఉండగా పెంచిన ధరతో 828కి చేరుకుంది. అదే విధంగా వాణిజ్య సిలిండర్లపైన కూడా ఒకేసారి రూ. 148 పెరిగింది. గృహాల్లో వాడే వినియోగదారులపైన కూడా కేంద్రం ఏమాత్రం కనికరం చూపలేదు. పెరిగిన ధరలు ఈ అర్ధరాత్రి నుండే అమల్లోకి వస్తాయని చమురు సంస్ధలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు చివరిదశకు చేరుకోగానే గ్యాస్ ధరను విపరీతంగా పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవటం గమనార్హం.