ఇది ఆరంభం మాత్రమే, ఎండగడతాం: చంద్రబాబు ఆగ్రహం

Published : Jul 25, 2019, 10:45 AM ISTUpdated : Jul 25, 2019, 01:02 PM IST
ఇది ఆరంభం మాత్రమే, ఎండగడతాం: చంద్రబాబు ఆగ్రహం

సారాంశం

సభలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. తనను తిట్టించేందుకే అధికార పార్టీ సభ్యులకు మైక్ ఇస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఆర్ధిక, భౌతికదాడులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని పోరాటాలు మరింత ముమ్మరం చేస్తామని చంద్రబాబు తెలిపారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న విధానాలను నిరసిస్తూ ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీలో వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులను అవమానాలకు గురి చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా అమరావతిలో ర్యాలీ చేపట్టబోతున్నట్లు తెలిపారు.  

సభలో ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు విమర్శించారు. తనను తిట్టించేందుకే అధికార పార్టీ సభ్యులకు మైక్ ఇస్తున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఆర్ధిక, భౌతికదాడులు చేస్తున్నారని ఆరోపించారు. 

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని పోరాటాలు మరింత ముమ్మరం చేస్తామని చంద్రబాబు తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

అసెంబ్లీని లోటస్ పాండ్ చేసేశారు: వైసీపీపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : ఓవైపు చలి, మరోవైపు వర్షాలు... ఆ ప్రాంతాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త..!
Deputy CM Pawan Kalyan: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సమావేశంలో పవన్ కీలక ప్రసంగం | Asianet News Telugu