రాజకీయ భవిష్యత్ పై కీలక ప్రకటన చేసిన పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి

By Nagaraju penumalaFirst Published Jul 25, 2019, 10:25 AM IST
Highlights

వైద్యవిద్య ప్రవేశాల్లో 550 జీవో అమలులో విధానపరమైన లోపం కారణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు నష్టపోతున్నారని రఘువీరారెడ్డి ఆరోపించారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేలా మరోసారి కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సీఎం జగన్‌ ను కోరుతూ లేఖ రాశారు రఘువీరారెడ్డి.  

తిరుమల: తన రాజకీయ భవిష్యత్ పై కీలక ప్రకన చేశారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. ఆరు నెలల పాటు రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు స్పష్టం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన  అనంతరం మీడియాతో మాట్లాడారు. 

తన స్వగ్రామమైన అనంతపురం జిల్లాలోని నీలకంఠాపురంలో దేవాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తాను చేపట్టిన దైవ కార్యం, ఆలయ నిర్మాణం పూర్తి చేసేంత వరకు రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. 

click me!