కొడాలి నాని విషయంలో చంద్రబాబు చేసిన తప్పు అదే: వర్ల సంచలన వ్యాఖ్యలు

By Nagaraju penumalaFirst Published Nov 22, 2019, 4:12 PM IST
Highlights

మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని క్షమాపణలు చెప్పాలని నిలదీశారు. తన రూపంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు వర్ల రామయ్య. తన తల్లిదండ్రులు ఇచ్చిన రూపాన్ని విమర్శిస్తారా అంటూ నిలదీశారు. 

అమరావతి: ఏపీ మంత్రి కొడాలి నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. కొడాలి నాని పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఎంత పేరు తెచ్చుకున్నారో తెలియదు గానీ బూతులు మంత్రిగా మాత్రం పేరు తెచ్చుకున్నారంటూ వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కొడాలి నానిని మంత్రిగా ఎలా కొనసాగిస్తున్నారో సీఎం జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2004లో కొడాలి నానికి సీటిచ్చి చంద్రబాబు నాయుడు తప్పు చేశారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు సీటివ్వకుంటే కొడాలి నాని లారీలు నడిపేవారంటూ చెప్పుకొచ్చారు. 

ప్రభుత్వ జీవోలు చదవాలన్నా అవగాహన కూడా లేని వ్యక్తి మంత్రిగా కొనసాగుతుండటం ఏపీ ప్రజల దురదృష్టమన్నారు. బూతుల మంత్రి కొడాలి నానిని రాజ్యాంగాన్ని వ్యతిరేకించి ప్రవర్తిస్తుంటే సీఎం జగన్ ఏం చేస్తున్నారంటూ నిలదీశారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులపై చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొడాలి నాని క్షమాపణలు చెప్పాలని నిలదీశారు. 

మేం వెళ్లిపోయాం, జూ.ఎన్టీఆర్ కు టీడీపీని అప్పగించు: బాబుపై రెచ్చిపోయిన కొడాలి నాని

తన రూపంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు వర్ల రామయ్య. తన తల్లిదండ్రులు ఇచ్చిన రూపాన్ని విమర్శిస్తారా అంటూ నిలదీశారు. ముందు కొడాలి నాని తన వేషధారణ మార్చుకోవాలని సూచించారు. కొడాలి నాని వేషధారణ గురించి అందరికీ తెలుసునన్నారు. నోట్లో పాన్ వేసుకుని,చొక్కా గుండీలు ఎవరు తీస్తారో అందరికీ తెలుసునన్నారు వర్ల రామయ్య. 

గతంలో తాను పోలీస్ అధికారిగా పనిచేశాననని గుర్తు చేశారు. కొడాలి నాని గతమంతా తనకు తెలుసునంటూ చెప్పుకొచ్చారు. తాను నోరు విప్పితే ఏమవుతుందో తెలుసుకోవాలంటూ మంత్రి కొడాలి నానికి హెచ్చరించారు వర్ల రామయ్యా.

ఇకపోతే టీడీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ బీజేపీ ఎంపీ సుజనాచౌదరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కన్న తల్లిలాంటి టీడీపీని వదిలి సవతి తల్లిలాంటి వేరే పార్టీలోకి చేరబోరని తెలిపారు. ఎండమావులను చూసి నీరనుకున్నవారెవరు కూడా టీడీపీ లేరని చెప్పుకొచ్చారు. 

20 మంది టీడీపీ, వైసీపీ ప్రజాప్రతినిధులు టచ్‌లో: సుజనా సంచలనం

సుజనా చౌదరి వెళ్లారు కదా అని అంతా వెళ్తారనుకుంటే పొరపాటేనని వర్ల రామయ్య చెప్పుకొచ్చారు. సుజనా చౌదరి కేంద్రమంత్రి పదవి ఇచ్చేస్తారని టీడీపీని వీడి బీజేపీలో చేరిపోయారని కానీ అది ఇవ్వలేదని ఇప్పుడు ఏదో ఒక టాపిక్ తో హల్ చల్ చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ వర్ల రామయ్య ఆరోపించారు. 

 

click me!