ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి టీడీపీ రెడీ

By narsimha lodeFirst Published Dec 9, 2018, 4:10 PM IST
Highlights

:రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు  ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఉన్న నియోజకవర్గాల్లో  కూడ పోటీ చేయాలని  టీడీపీ నిర్ణయం తీసుకొంది


అమరావతి:రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు  ఇతర రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలు ఉన్న నియోజకవర్గాల్లో  కూడ పోటీ చేయాలని  టీడీపీ నిర్ణయం తీసుకొంది. గతంలో  కూడ కొన్ని స్థానాల్లో  పోటీ చేసింది. జాతీయ రాజకీయాల్లో  కూడ   క్రియాశీలకంగా వ్యవహరించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.

వచ్చే ఏడాది ఒడిశా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగు ప్రజలు ఎక్కువగా  నివసించే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో  పోటీ చేయాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది.  ఒడిశాలోని బరంపుర, కటక్, రాయగడ, కోరాపుట్ ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే  విషయమై ఆ పార్టీ నేతలు చంద్రబాబునాయుడుతో చర్చించారు.

ఈ రాష్ట్రంలోని రాయగడ, మల్కన్ గిరి, గంజాం, నవరంగపూర్ జిల్లాల్లో పోటీ చేయనున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని  భావిస్తున్నారు.  ఈ నియోజకవర్గాల్లో  పరిస్థితులపై సర్వే నిర్వహిస్తున్నారు. మరో వైపు 147 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఎలా ఉంటుందనే విషయమై  ఆ పార్టీ నేతలు చర్చిస్తున్నారు. 

click me!