మున్సిపల్ ఎన్నికలు: పుంగనూరు బరి నుంచి తప్పుకున్న టీడీపీ, కారణమిదే..?

By Siva KodatiFirst Published Mar 2, 2021, 4:00 PM IST
Highlights

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో పోటీ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. పట్టణంలోని కేవలం మూడు వార్డుల్లోనే నామినేషన్లకు ఎస్ఈసీ అనుమతించింది

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరులో పోటీ నుంచి తాము తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.

పట్టణంలోని కేవలం మూడు వార్డుల్లోనే నామినేషన్లకు ఎస్ఈసీ అనుమతించింది. మిగిలిన 31 వార్డుల్లో నామినేషన్లకు ఎస్ఈసీ అనుమతి ఇవ్వలేదు. పుంగనూరులోని 9, 14, 28 వార్డుల్లో మాత్రమే నామినేషన్లు వేసేందుకు టీడీపీకి ఎస్ఈసీ అనుమతినిచ్చింది.

గతంలో నామినేషన్ల సమయంలో చోటు చేసుకున్న ఘటనలతో మరో అవకాశం కల్పించింది ఎస్ఈసీ. అయితే రెండోసారి అవకాశం ఇచ్చినా టీడీపీ నుంచి నామినేషన్లు దాఖలు కాలేదు. 

కాగా, ఏపీలో గతేడాది కరోనా కారణంగా వాయిదా పడిన మున్సిపల్‌ ఎన్నికల పోరును ఇవాళ తిరిగి ప్రారంభించారు. ఇందులో భాగంగా ఉదయం నుంచి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ మొదలుపెట్టారు.

గతంలో ఎక్కడ నిలిపేశారో అక్కడి నుంచే తిరిగి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. దీంతో ఇవాళ రాష్ట్రంలోని 12 కార్పోరేషన్లు, 75 మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆయా చోట్ల గట్టి భద్రత మధ్య గతంలో తీసుకున్న నామినేషన్లను బయటికి తీసి దుమ్ముదులిపారు.

click me!