వార్డు వాలంటీర్లపై నిమ్మగడ్డ ఆదేశాలు: హైకోర్టులో ఏపీ సర్కార్ పిటిషన్, తీర్పు రిజర్వ్

By Siva KodatiFirst Published Mar 2, 2021, 3:18 PM IST
Highlights

వార్డు వాలంటీర్లను మున్సిపల్ ఎన్నికలకు దూరంగా వుంచాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆదేశాలపై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు . వార్డ్ వాలంటీర్ల వద్దనున్న ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలపై ఏపీ ప్రభుత్వం న్యాయస్థానంలో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. 

వాలంటీర్లు పెన్షన్లు, ప్రభుత్వ పథకాల అమలులో పాల్గొనకపోతే లబ్ధిదారులు తీవ్ర్ ఇబ్బందులను ఎదుర్కొంటారని ఏపీ ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చింది. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 

కాగా, మున్సిపల్ ఎన్నికల్లోను వాలంటీర్ల సేవల వినియోగం ఉండదని నిమ్మగడ్డ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు పూర్తయ్యే వరకు వాలంటీర్ల కదలికలపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

పంచాయతీ ఎన్నికల్లో వాలంటీర్ల పాత్రలపై పలు అనుమానాలు తలెత్తాయని వ్యాఖ్యానించారు. విపక్ష పార్టీలన్నీ వాలంటీర్లే దగ్గరి నుంచి అధికార పక్షానికి సహకరించారని ఫిర్యాదులు చేశాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ తెలిపారు.

ఈ నేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఎన్నికల ప్రక్రియలో వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొనకూడదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.
 
click me!