చంద్రబాబుని అంతం చేయాలని... జగన్ ప్రభుత్వ కుట్రలు: బుద్దా సంచలనం

By Arun Kumar PFirst Published Mar 2, 2021, 3:01 PM IST
Highlights

 రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు వారసుడు చంద్రబాబని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అభివర్ణించారు. 

విజయవాడ: రేణిగుంట విమానాశ్రయంలో టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడిని అడ్డుకోవడం జగన్ పిరికిపంద చర్యలకు నిదర్శమని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు.  రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు వారసుడు చంద్రబాబని అభివర్ణించారు. బ్రిటీష్ వారు అల్లూరిని అంతమొందించినట్టే, జగన్ ప్రభుత్వం చంద్రబాబుని అంతంచేయాలని చూస్తోందని బుద్దా ఆరోపించారు. 

''చంద్రబాబే తిరిగి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవతాడన్న భయం జగన్ లో మొదలైంది. జగన్ కు నిజంగా ప్రజాబలముంటే, ఆయన ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలను ప్రజలు ఆదరిస్తున్నారనుకంటే తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాలి. అసలు ఎన్నికల్లో వైసీపీని ప్రజలు ఆదరిస్తే, టీడీపీని మూసేస్తాం" అని ఛాలెంజ్ విసిరారు. 

''ప్రజాబలంతో టీడీపీ విజయం సాధిస్తే వైసీపీ దుకాణం కట్టేయడానికి జగన్ సిద్ధమేనా? 21నెలల పాలనలో ప్రజలకు మేలుచేశాననే నమ్మకం జగన్ కుఉంటే, ఆయన తక్షణమే అసెంబ్లీని రద్దుచేసి జనంలోకి వెళ్లాలి. రాష్ట్రాన్నికాపాడుకోవడానికి, చంద్రబాబు నాయకత్వాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రజలంతా మున్సిపల్ ఎన్నికలను అవకాశంగా ఉపయోగించుకోవాలి. దుష్టశక్తులపై పోరాడే విషయంలో చంద్రబాబు వెనకడుగు వేయరనే వాస్తవాన్ని ప్రజలు గమనించాలి'' అని బుద్దా అన్నారు. 

read more ఆరు గంటలుగా రేణిగుంట ఎయిర్‌పోర్టులో బాబు నిరసన

సోమవారం ఉదయం రేణిగుంట విమానాశ్రయంలోనే చంద్రబాబునాయుడు బైఠాయించి నిరసనకు దిగారు. చిత్తూరుకు వెళ్లకుండా పోలీసులు అడ్డు చెప్పడంతో చంద్రబాబు ఎయిర్ పోర్టు లాంజ్ లో నేలపై కూర్చొని నిరసనకు దిగారు.ఇలా ఆందోళనకు దిగిన చంద్రబాబునాయుడితో జాయింట్ కలెక్టర్, చిత్తూరు ఎస్పీ చర్చించారు. ఈ చర్చలు ఫలవంతం కావడంతో చంద్రబాబునాయుడు రేణిగుంట విమానాశ్రయం నుండి హైద్రాబాద్ కు బయలుదేరారు.

చిత్తూరు, తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకొన్నాయని చంద్రబాబు అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ విషయమై తాము చర్యలు తీసుకొంటామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు.  ఈ హామీతో చంద్రబాబునాయుడు తన నిరసన విరమించారు.రేణిగుంట విమానాశ్రయంలో సుమారు 9 గంటల పాటు చంద్రబాబునాయుడు నేలపైనే కూర్చొని నిరసనకు దిగారు. అధికారుల హామీతో చంద్రబాబు రేణిగుంట విమానాశ్రయం నుండి హైద్రాబాద్ కు బయలుదేరి వెళ్లారు.

click me!