రాజకీయ కక్షతోనే చంద్రబాబు అరెస్టు.. : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్

By Mahesh Rajamoni  |  First Published Oct 21, 2023, 5:02 AM IST

TIRUPATI: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌లో రాజకీయ ప్రమేయం ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. చంద్ర‌బాబు అరెస్టును రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. అలాగే, రానున్న ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
 


Former Union Minister Chinta Mohan: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత‌, ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్‌లో రాజకీయ ప్రమేయం ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. చంద్ర‌బాబు అరెస్టును రాజ‌కీయ ప్ర‌తీకార చ‌ర్య‌గా ఆయ‌న అభివ‌ర్ణించారు. అలాగే, రానున్న ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని కేంద్ర మాజీ మంత్రి ధీమా వ్యక్తం చేశారు.

వివ‌రాల్లోకెళ్తే.. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు అరెస్టులో రాజకీయ ప్రమేయం ఉందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. తిరుప‌తిలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చింతా మోహన్‌ మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు తనకు గత 48 ఏళ్లుగా తెలుసున‌నీ, ఆయ‌న ఏ తప్పు చేయలేదని తాను నమ్ముతున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే నమ్ముతున్నార‌ని పేర్కొన్న చింతా మోహ‌న్.. ప్రతిపక్ష నాయకుడిని అరెస్టు చేయడం చెడు-రాజకీయ ప్రతీకార చర్యగా అభివ‌ర్ణించారు. కోర్టులపై ప్రజలకు నమ్మకం తగ్గిపోతోందనీ, అసలు ఆధారాలు లేకుండా అరెస్టు చేయడంలో న్యూఢిల్లీలోని బీజేపీ నేతల పాత్ర ఉందని ఆరోపించారు.

Latest Videos

undefined

చంద్ర‌బాదు అరెస్టును ప్రజాతంత్ర, అభ్యుదయ శక్తులు పెదవి విప్పి ఖండించాలన్నారు. "ప్రజలు క్రమంగా కోర్టులపై విశ్వాసం కోల్పోతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించాలి. కోర్టుల్లో రాజకీయ ప్రమేయంపై సీజేఐ సమాధానం కోరడం స్వాగతించదగ్గ విషయమని" చింతా మోహన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసి రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. "ఆంధ్రప్రదేశ్‌లో ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ పొలిటికల్ సర్వీస్‌గా మారడం శోచనీయం. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌కు అనుమతి ఇవ్వడానికి, పోలీసులు పొల్యూషన్ సర్టిఫికేట్ డిమాండ్ చేయడం.. సరైన కారణాలు లేకుండా అనుమతులను ఆలస్యం చేయడం సిగ్గుచేటు" అని ఆయన అన్నారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నాయ‌క‌త్వంలోని వైఎస్ఆర్సీపీ స‌ర్కారు ఆంధ్రప్రదేశ్‍ రాష్ట్రాన్ని అరెస్టుల ప్రదేశ్‌గా మార్చింద‌ని విమర్శించారు. చంద్ర‌బాబు అరెస్టు వెనుక బీజేపీ హ‌స్తం కూడా ఉంద‌ని ఆయ‌న ఆరోపించారు. అలాగే, పాల‌స్తీనా-ఇజ్రాయెల్ వివాదం పై కూడా చింతా మోహ‌న్ స్పందించారు. వేలాది మంది పాలస్తీనియన్ల దుర్ఘటనను నిర్మొహమాటంగా విస్మరిస్తూ, ఇజ్రాయెల్‌కు ప్రధాని నరేంద్ర మోడీ మద్దతు ఇవ్వడం, పాశ్చాత్య దృక్పథంతో పక్షపాతం చూపడాన్ని ఆయన ఖండించారు. వచ్చే ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

click me!