టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేపత పవన్ కల్యాణ్‌లు ఈ నెల 23న రాజమండ్రిలో సమావేశం నిర్వహించనున్నారు. వీరిద్దరి అధ్యక్షతన టీడీపీ - జనసేన జేఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు చాలా సమయం వుండగానే జనసేన అధినేత పవన కల్యాణ్ పొత్తు ప్రకటన చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో జనసేన కలిసి నడుస్తుందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ తర్వాత ఇరు పార్టీలు సమన్వయ కమిటీలను నియమించారు. పవన్ కల్యాన్ నిర్వహించిన నాలుగో విడత వారాహి విజయయాత్రలో టీడీపీ శ్రేణులు పాల్గొనగా.. చంద్రబాబు అరెస్ట్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో జనసేన నేతలు పాల్గొంటున్నారు.
చంద్రబాబు నాయుడు విడుదలయ్యాయి.. పొత్తులపై మరింత క్లారిటీ రానుంది. అలాగే సీట్ల పంపకాలు, జగన్‌ను ఎలా ఎదుర్కోవాలి అన్న దానిపై వ్యూహాలు రచించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన అధినేపత పవన్ కల్యాణ్‌లు ఈ నెల 23న రాజమండ్రిలో సమావేశం నిర్వహించనున్నారు. వీరిద్దరి అధ్యక్షతన టీడీపీ - జనసేన జేఏసీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంతకుముందు శుక్రవారం పవన్ కళ్యాణ్, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా విద్యా శాఖలో అవకతవకలు జరుగుతున్నాయని, అమ్మ ఒడి పథకంలో పెద్ద స్కాం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. అమ్మ ఒడి పథకంలో రూ. 743 కోట్ల స్కాం జరిగిందని నాదెండ్ల మనోహర్ ఆరోపణలు చేయగా.. 2024 ఎన్నికల తర్వాత తాము ఈ స్కాంపైనే మొదటగా దర్యాప్తు జరిపిస్తామని పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు.
ALso Read: అమ్మ ఒడిలో రూ. 743 కోట్ల స్కాం.. ఎన్నికల తర్వాత ఈ స్కాంపైనే దర్యాప్తు: జనసేన తీవ్ర ఆరోపణలు
జగన్ ప్రభుత్వం విద్యా శాఖలో తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటున్నదని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. అమెరికాలోని యూనివర్సిటీలోకి వెళ్లే వారికి టోఫెల్ అవసరం ఉంటుందని, కానీ, స్కూల్‌లో చదువుకునే రెండో తరగతి, మూడో తరగతి పిల్లలకు ఈ శిక్షణ ఎందుకు అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు శిక్షణ కోసం విదేశీ సంస్థలకు ఎందుకు పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారని అడిగారు. ఆ ఒప్పందాల్లోని క్లాజులనూ ఎందుకు పట్టించుకోవడం లేదని అన్నారు. కేవలం ఆ సంస్థలే ఎందుకు శిక్షణ ఇవ్వాలి? ఆర్బిట్రేషన్ స్విట్జర్లాండ్‌లో ఎందుకు అని ప్రశ్నించారు. అదే విధంగా ఆయన విద్యా కానుక, అమ్మ ఒడి పథకాల గురించి మాట్లాడారు.
ప్రభుత్వం జరిపిన సర్వేల వివరాలను ఆధారంగా చేసుకునే తాను మాట్లాడుతున్నానని పేర్కొంటూ సెప్టెంబర్ 2022 నుంచి ఆగస్టు 2023 మధ్యలో ప్రభుత్వ పాఠశాలల నుంచి 4.48 లక్షల విద్యార్థులు వెళ్లిపోయారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. జగన్ ప్రభుత్వం 42.61 లక్షల విద్యార్థులకు అమ్మ ఒడి ఇచ్చారని వివరించారు. అదే విద్యా కానుక మాత్రం 39.95 లక్షల మంది విద్యార్థులకు ఇచ్చారని, ఈ సంఖ్య ఎందుకు తగ్గిందని ప్రశ్నించారు.