కృష్ణా జిల్లా ప్రసాదంపాడుకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, అభిమాని బొప్పన రాఘవేంద్రరావు చావుబతుకుల్లో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చివరి కోరిక ఏంటో తెలుసా? తాను బతకాలని కాదు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుని చూడాలని. బంధువులు ఈ సమాచారాన్ని చంద్రబాబు గారికి చేరేలా చేశారు
కొనప్రాణంతో వున్నా బొప్పన రాఘవేంద్రరావు అనే తెలుగుదేశం అభిమాని కోసం టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుఎయిర్‌పోర్ట్‌కి వెళ్లకుండా నేరుగా ఆస్పత్రికొచ్చి రాఘవేంద్రరావుని పరామర్శించారు.
కృష్ణా జిల్లా ప్రసాదంపాడుకి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త, అభిమాని బొప్పన రాఘవేంద్రరావు చావుబతుకుల్లో విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన చివరి కోరిక ఏంటో తెలుసా? తాను బతకాలని కాదు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుని చూడాలని. బంధువులు ఈ సమాచారాన్ని చంద్రబాబు గారికి చేరేలా చేశారు. అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన చంద్రబాబు, హుటాహుటిన ఆస్పత్రికి చేరారు. బొప్పన రాఘవేంద్రరావుని పరామర్శించారు.
తన ఆశ, శ్వాస అయిన తెలుగుదేశంని నడిపించే నాయకుడ్ని చూశానన్న తృప్తి ఆయన కళ్లల్లో కనిపించింది. కృష్ణా జిల్లాలో 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచీ కరడుగట్టిన కార్యకర్తగా, నాయకుడిగా పార్టీకి విస్తృత సేవలందించారు రాఘవేంద్రరావు. దుర్గాపురం ప్రాంత కార్పోరేటర్, వీజీటియం వుడా సభ్యులుగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న ఎన్టీఆర్ కారులో వుండి భోజనం చేస్తుంటే..కారు అద్దంలోంచి చూస్తున్న ఫోటో అందరికీ చిరపరిచితమే.
కారు అద్దంలోంచి అన్నగారిని ఆప్యాయంగా చూసిన ఆ వ్యక్తే మన బొప్పన రాఘవేంద్రరావు. వయోభారంతో వచ్చిన సమస్యలతో ఆస్పత్రిలో చేరిన రాఘవేంద్రరావు పరిస్థితి విషమంగా వుంది. అయినా ఆయన చెవులకు తెలుగుదేశం పేరు తారకమంత్రంలా వినిపిస్తుంది. ``నిన్ను చూసేందుకు చంద్రబాబు వస్తున్నారు..అని బంధువులు చెబుతుంటే..కొన ఊపిరిని కొనసాగించేలా శక్తిని కూడదీసుకున్నారు తెలుగుదేశం అంటే పంచప్రాణాలుగా భావించే బొప్పన రాఘవేంద్రరావు. చంద్రబాబునాయుడు భావోద్వేగాలు కనిపించవు.
అదికారంలో వున్నా లేకున్నా నిత్యమూ అభివృద్ధి, ముందుచూపుతో ప్రణాళికలు, భావితరాల అవసరాలపై అధ్యయనం వంటి వాటిలో క్షణం తీరికలేకుండా గడిపే చంద్రబాబు... తెలుగుదేశం వీరాభిమాని బొప్పన రాఘవేంద్రరావు గారి చివరి కోరిక అంటూ బంధువులు చెప్పగానే...ఎయిర్‌పోర్ట్ కి వెళ్లాల్సిన కాన్వాయ్‌ని హాస్పిటల్‌కి అర్జంటుగా మళ్లించండి అంటూ ఆదేశాలిచ్చి..ఆగమేఘాలపై వచ్చి పరామర్శించారు. అందుకే తెలుగుదేశంని ఒక పార్టీగా కాకుండా ఒక అతి పెద్ద ఉమ్మడి కుటుంబంగా భావిస్తారు కార్యకర్తలు, నేతలు. కష్టమొచ్చినా, కన్నీళ్లొచ్చినా..సంతోషమైనా..సంబరాలైనా పసుపు సైన్యం పంచుకుంటుంది. అండగా నిలుస్తుంది.