భర్త కళ్లెదుటే... మహిళ సజీవ దహనం..!

Published : Aug 14, 2021, 08:10 AM ISTUpdated : Aug 14, 2021, 08:19 AM IST
భర్త కళ్లెదుటే... మహిళ సజీవ దహనం..!

సారాంశం

ఏడాదిన్నర క్రితం రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి బెంగళూరులో పెళ్లి చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు.


భర్త కళ్లెదుటే ఓ వివాహిత ఒంటికి నిప్పు పట్టించుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా  బైరెడ్డిపల్లిలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లె గ్రామానికి చెందిన హరి ప్రసాద్ తిరుపతిలో ఎంబీఏ చదివాడు. ఆ సమయంలో తమిళనాడు రాష్ట్రం దిండుగల్ కు చెందిన ఎమ్మెస్సీ విద్యార్థిని సత్యవాణి అలియాస్ హర్షిత(32) తో ఉన్న పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ బెంగళూరులోని ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు.

ఏడాదిన్నరక్రితం రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి బెంగళూరులోని ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం రెండు కుటుంబాల పెద్దలను ఒప్పించి బెంగళూరులో పెళ్లి చేసుకొని అక్కడే నివాసం ఉంటున్నారు.

సత్యవాణి శుక్రవారం బెంగళూు నుంచి ద్విచక్రవాహనంపై మునిపల్లెలోని హరి ప్రసాద్ ఇంటికి చేరింది. కుటుంబసభ్యుల సమాచారంతో హరిప్రసాద్ కూడా స్వగ్రామానికి చేరుకున్నాడు. తర్వాత సత్యవాణి ఇంటి ఆవరణలో ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పంటించుకుంది. మంటలు దట్టంగా ఎగసిపడగా ఇంట్లో నుంచి భర్త వచ్చి కాపాడే ప్రయత్నం చేశాడు. అతను కూడా స్వల్పంగా గాయపడ్డాడు.

సత్యవాణి మంటల్లో కాలిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్సై మునిస్వామి, రెవెన్యూ అధికారులు గ్రామానికి చేరుకొని విచారించారు. మృతికి కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్సై పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu