సముద్రంలో బోల్తా పడిన పడవ: ముగ్గురు జాలర్ల మృతి

Published : Aug 14, 2021, 10:30 AM ISTUpdated : Aug 14, 2021, 10:35 AM IST
సముద్రంలో బోల్తా పడిన పడవ: ముగ్గురు జాలర్ల మృతి

సారాంశం

చేపలవేట కోసం సముద్రంలోకి వెళ్లిన జాలర్ల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. ఈ విషాదకరమైన సంఘటన శ్రీకాకుళం జిల్లా బందరువానిపేట సముద్ర తీరంలో చోటు చేసుకుంది.

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదకరమైన సంఘటన జరిగింది. సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన జాలర్ల పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు జాలర్లు గల్లంతయ్యారు. వారు ముగ్గురు కూడా మరణించినట్లు భావిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లా గార్ల మండలం బందరువానిపేట తీరంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ముగ్గురిలో ఒకరి మృతదేహాన్ని వెలికి తీశారు. అతన్ని గణేష్ గా గుర్తించారు. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. 

మృతి చెందిన జాలర్లు బందరవానిపేటకు చెందినవారు. మృతుల కుటుంబాల సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?
Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు