జనసేన ఓట్లు మాత్రమే చీల్చగలదు, అధికారాన్ని చేజిక్కించుకోలేదు : టిజి వెంకటేశ్

First Published Jun 20, 2018, 11:37 AM IST
Highlights

హోదా వస్తే టిడిపి బలపడుతుందని కేంద్రం బయపడుతోందన్న ఎంపి వెంకటేశ్

సినీ నటుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో కేవలం ఓట్లు మాత్రమే చీల్చగలదని తెలుగుదేశం ఎంపీ టిజి వెంకటేశ్ అన్నారు. ఆ పార్టీ అధికారాన్ని చేపట్టడం అసంభవమన్నారు.  కర్నూల్ లో మీడియాతో మాట్లాడిన టిజి వెంకటేశ్ ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా హోదా విషయంలో తెలుగు ప్రజలను మోసం చేస్తోందని అన్నారు. హోదా ఇస్తే టిడిపి పార్టీ బలపడుతుందనే ఇవ్వడం లేదన్న టిజి వెంకటేశ్ తెలిపారు. రాష్ట్రానికి హోదా వస్తే మరింత అభివృద్ది చెందే అవకాశం ఉంటుందని,  అపుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందన్నారు. అలాంటి హోదా కోసం అన్ని పార్టీలు తమ విధానాలను పక్కనపెట్టి పోరాడాలని సూచించారు.

 ప్రధాని మోదీ అనాలోచిత విధానాల వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంకటేశ్ విమర్శించారు.ఆయన చేసిన నోట్ల రద్దు వల్ల దేశంలోని బ్యాకింగ్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని అన్నారు. దీని వల్ల బ్యాంకులతో పాటు సామాన్యులు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు.

 రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు. అన్ని పార్టీలు విమర్శలు చేయడం మానేసి రాష్ట్రాభివృద్ది కోసం   ప్రభుత్వానికి సహకరించాలని  టీజి వెంకటేశ్ సూచించారు.

 
 

click me!