టీడీపీ నుంచి చాలా మంది వస్తారు: వంశీ భేటీపై సుజనా క్లారిటీ

By narsimha lode  |  First Published Oct 25, 2019, 1:49 PM IST

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ నుండి బీజేపీలో చాలా మంది చేరేందుకు సిద్దంగా ఉన్నారని మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ సుజనా చౌదరి చెప్పారు. వల్లభనేని వంశీ వ్యక్తిగత సమస్యలపైనే తనను కలిశారని ఆయన చెప్పారు. 


అమరావతి: అతి త్వరలో టీడీపీ నుండి పెద్ద ఎత్తున బీజేపీలో చేరికలు ఉండే అవకాశం ఉందని మాజీ కేంద్ర మంత్రి, ఎంపీ సుజనా చౌదరి స్పష్టం చేశారు. బీజేపీలో ఎవరెవరు చేరుతారో తాను ఇప్పుడే చెప్పబోనన్నారు. ఎంత మంది బీజేపీలో చేరుతారో మీరే చూస్తారని ఆయన మీడియా ప్రతినిధులకు చెప్పారు.

గుంటూరు జిల్లాలో బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో  ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందన్నారు.అతి త్వరలోనే చాలా మంది నేతలు టీడీపీ నుండి బీజేపీలో చేరుతారని ఆయన చెప్పారు. సమర్ధత, సామర్థ్యం ఉన్న నేతలంతా బీజేపీలో చేరాలని తాను కోరుతున్నట్టుగా ఆయన చెప్పారు.

Latest Videos

Also Read: బాబుకు షాక్..?: బీజేపీ ఎంపీతో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ

రాష్ట్రంలో జమిలి ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అధికారాన్ని కైవసం చేసుకొనేందుకు తాము అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నామని సుజనా చౌదరి చెప్పారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేస్తున్నట్టుగా సుజనా చౌదరి చెప్పారు.వల్లభనేని వంశీ ఆయన సమస్యలను చెప్పుకొనేందుకు వచ్చారని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం దాట వేశారు. 

శుక్రవారం నాడు బీజేపీ నేత చందు సాంబశివరావు ఇంట్లో మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఈ సమయంలో సుజనానను కలుసుకొనేందుకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వచ్చారు. ఇంటి బయటే కారు వద్దే వంశీ సుజనా చౌదరి కోసం ఎదురు చూశాడు.

Also Read:ఒక్క రోజు దీక్షకు రూ. 10 కోట్లా?: బాబు దీక్షపై హైకోర్టు ఆశ్చర్యం

సుజనా చౌదవరి బయటకు రాగానే సుజనా చౌదరితో  వంశీ మాట్లాడారు. సుజనా కారులోనే వంశీ ఆయనతో వెళ్లారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. వల్లభనేని వంశీ పార్టీ మారుతారని కొొంత కాలంగా ప్రచారం సాగుతోంది.పార్టీ మార్పు విషయమై వంశీ గురువారం నాడు స్పష్టత ఇచ్చారు.

గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో నకిలీ ఇళ్లపట్టాలను ఇచ్చారనే పేరుతో వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. ఈ కేసు విషయమై వంశీ గురువారం నాడు వివరణ ఇచ్చారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై కేసును పెట్టారని వంశీ వివరించారు.వైసీపీ ప్రభుత్వం తనపై కేసును బనాయించిందన్నారు. తప్పుడు కేసు పెట్టిన రెవిన్యూ అధికారులపై కూడ చర్యలు తీసుకోవాలని వల్లభనేని వంశీ మోహన్ డిమాండ్ చేశారు.

టీడీపీ నుండి చాలా మంది బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని వంశీ కలిసిన తర్వాత సుజనా చౌదరి ప్రకటించడం గమనార్హం. సుజనా చౌదరి బీజేపీలో చేరిన తర్వాత చాలామంది టీడీపీ నేతలను బీజేపీలో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కొందరు టీడీపీ నేతలు ఇప్పటికే బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు.మరికొందరు టీడీపీ నేతలు కూడ బీజేపీలో చేరేందుకు రడీగా ఉన్నారని శుక్రవారం నాడు కుండబద్దలు కొట్టారు. 

click me!