(వీడియో) జగన్ కు 200 సంవత్సరాల శిక్ష పడాలి : కేశినేని

Published : May 23, 2017, 03:01 PM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
(వీడియో) జగన్ కు 200 సంవత్సరాల శిక్ష పడాలి : కేశినేని

సారాంశం

కేవలం రూ.60 కోట్ల కుంభకోణానికి తమిళనాడులో శశికళకు 4 ఏళ్ల జైలు  శిక్షపడింది. లక్ష కోట్ల రుపాయల అక్రమాస్తుల కేసులకు సంబంధించి జగన్ మీద 12 కేసులున్నాయి. వీటన్నింటికి శిక్ష పడితే జగన్‌  200 ఏళ్లు జైలులో ఉండాల్సి వస్తుంది

 

 

ప్రతిపక్షనాయకుడు, వైసిపి అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై తెదేపా ఎంపీ కేశినేని నాని  ఆగ్రహం వ్యక్తంచేశారు.

 

ఎక్కడో హత్య జరిగితే, చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని బర్త్ రఫ్ చేయాలని జగన్ కోరడానికి ఆయన తీవ్రఅభ్యంతరం చెప్పారు. ఈ విజ్ఞప్తితో జగన్ గవర్నర్ కు ఒక వినతిప్రతం ఇవ్వడాన్ని తప్పు పడుతూ  అసలు హింసారాజకీయాలకు మూలం జగన్ కుటుంబమో నని ఆయన అన్నారు. అసులు   జగన్‌ను తీసుకెళ్లి బంగాళాఖాతంలో కలపాలన్నారు. కేవలం రూ.60 కోట్ల కుంభకోణానికి తమిళనాడులో శశికళకు 4 ఏళ్ల జైలు  శిక్షపడింది. లక్ష కోట్ల రుపాయల అక్రమాస్తుల కేసులకు సంబంధించిన జగన్ మీద 12 కేసులున్నాయి. వీటన్నింటికి శిక్ష పడితే జగన్‌ 200 ఏళ్లు జైలులో ఉండాల్సి వస్తుంది,’ అని నాని అన్నారు.

 

జగన్‌ హత్యా రాజకీయాలు మానుకోవాలని ఆయన సలహ  ఇచ్చారు.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Speech: చంద్రబాబు పంచ్ లకి పడి పడి నవ్విన నారా భువనేశ్వరి| Asianet News Telugu
Vangalapudi Anitha Strong Warning to Jagan: గుర్తుపెట్టుకో జగన్ ఎవ్వరినీ వదిలిపెట్టం |Asianet Telugu