పత్తికొండలో శ్రీదేవీరెడ్డే అభ్యర్ధి

First Published May 23, 2017, 12:18 PM IST
Highlights

భవిష్యత్తులో టిక్కెట్టు విషయంలో ఎవరినుండి సమస్య రాకుండా వ్యూహాత్మకంగానే నారాయణరెడ్డి భార్య శ్రీదేవిరెడ్డి పేరును మీడియా సమావేశంలో జగన్ ప్రస్తావించారు. దాంతో నారాయణరెడ్డి మృతితో పోటీ విషయంలో ఎవరైనా ఆశలు పెట్టుకుంటే అవన్నీ మొగ్గలోనే తుంచేసినట్లైంది.

వచ్చే ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గంలో శ్రీదేవీరెడ్డి పోటీ చేయటం దాదాపు ఖాయమైంది. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి నారాయణరెడ్డి రెండు రోజుల క్రితమే హత్యకు గురైన సంగతి తెలిసిందే కదా? అదే విషయమై కడప జిల్లా పర్యటనలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు, రేపటి ఎన్నికల్లో పత్తికొండలో గెలవబోయే అభ్యర్ధి నారాయణరెడ్డిని హత్య చేయిస్తే నియోజకవర్గంలో వైసీపీ ఇక అభ్యర్ధి ఉండరని టిడిపి అనుకున్నట్లుందన్నారు. అలా అంటూనే నారాయణరెడ్డి లేకపోతే ఆయన భార్య పోటీ చేస్తారని జగన్ చెప్పారు. 50 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని కూడా పేర్కొన్నారు.

జగన్ చెప్పటం చూస్తుంటే నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో గెలుపు నారాయణరెడ్డిదే అనే ప్రచారమైతే బాగా సాగుతోంది. అటువంటి సమయంలో ఇన్ఛార్జి హత్య చేయటం నిజంగా దురదృష్టమే. అయితే, నారాయణరెడ్డి హత్య తాలూకు సింపతి ఎలాగూ ఉంటుంది కాబట్టి ఆయన భార్య శ్రీదేవీరెడ్డినే పోటీ చేయించాలని జగన్ డిసైడ్ అయినట్లు ఉంది. అందుకే బాహాటంగనే ప్రకటించారు. మళ్ళీ లేటైతే నారాయణరెడ్డి సోదరులో ఎవరో ఒకరు పోటీకి వచ్చే అవకాశం ఉందన్న విషయాన్ని జగన్ అనుమానించినట్లే ఉంది.

click me!