ప్రజాసమస్యలపై పోరాటం చేస్తాం.. తప్పుడు కేసులకు భయపడేది లేదు అంటూ టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. బెయిల్ పై విడుదలైన ఎమ్మెల్సీ అశోక్ బాబును విజయవాడలో ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లు పరామర్శించారు.
విజయవాడ : టిడిపి MLC Ashok Babuను విజయవాడలోని ఆయన నివాసంతో ఎమ్మెల్యే Gadde Rammohan తో కలిసి ఎంపీ Keshineni Nani పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అశోక్ బాబుపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపాలని చూశారు. తప్పుడు కేసులకు TDP నేతలు భయపడే పరిస్థితి లేదు. ఎంత బెదిరించినా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాం. ప్రజా సమస్యలపై పోరాటం కోసం పని చేస్తున్నాం. సంక్షేమ పథకాలకు మేము వ్యతిరేకం కాదు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలి’… అని కేశినేని నాని అన్నారు.
గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ... ’భస్మాసురుడి తరహాలో YS Jagan తన గొయ్యి తానే తవ్వుకుంటున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్ సద్వినియోగం చేసుకోవడం లేదు. ఎవరి పై కేసులు పెట్టి బెదిరించాలా? అనే ఆలోచన తప్ప పాలనపై లేదు. ఎంతమందిని జైలుకు పంపుతారో మేమూ చూస్తాం.. రాష్ట్ర ప్రజలకు జగన్ తీరని అన్యాయం చేస్తున్నారు’.. అని రామ్మోహన్ అన్నారు.
undefined
విద్యార్హత పై తప్పుడు ప్రచారం సమర్పించారని టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబును గురువారం అర్ధరాత్రి సిఐడి అధికారులు అరెస్టు చేశారు. 18 గంటల పాటు తమ అదుపులోనే ఉంచుకుని విజయవాడ సిఐడి కోర్టుకు తరలించారు. శుక్రవారం రాత్రి 11 గంటలకు ఈ కోర్టు ఇంచార్జ్ న్యాయమూర్తి సత్యవతి అశోక్ బాబుకు బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా, టిడిపి ఎమ్మెల్సీ Paruchuri Ashok Babuను గురువారం రాత్రి సిఐడి అధికారులు అరెస్టు చేశారు. Vijayawadaలోని ఆయన నివాసం నుంచి రాత్రి 11.30 గంటల సమయంలో తరలించారు గురువారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన అశోక్ బాబు రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మఫ్టీలో మాటువేసిన సిఐడి పోలీస్ ఆయనను అరెస్టు చేసి, వాహనంలో తరలించారు. అశోక్ బాబును అరెస్టు చేసినట్లు.. కోర్టులో హాజరు పరిచినట్లు సమాచారం ఇస్తూ ప్రకాశం జిల్లా కందుకూరు వాసి మాదాల గోపికి నోటీసు అందించారు.
అశోక్ బాబు వాDepartment of Commercial Taxesలో పనిచేసే సమయంలో బీకాం డిగ్రీ చదవకపోయినా.. చదివినట్లు తప్పుడు పత్రాలు సమర్పించారని.. మరికొన్ని ఆరోపణలతో విజయవాడ వాసి మెహర్ కుమార్ లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన
Lokayukta.. వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. సమగ్ర దర్యాప్తు కోసం సిఐడికి ఫిర్యాదు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ డి. గీతామాధురి ఇటీవల అశోక్ బాబుపై సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 477 ఏ, 465, 420 తదితర సెక్షన్ల కింద గత నెల 25న కేసు నమోదయింది. దర్యాప్తులో భాగంగా ఆయనను అరెస్టు చేశారు.
సర్వీస్ మేటర్స్ లో తప్పుడు కేసులో ఇరికించారు : చంద్రబాబు
టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్నందున ప్రభుత్వం ఆయనపై కక్షకట్టిందని అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ మేటర్స్ లో తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం చెల్లించక తప్పదు అని ఆయన హెచ్చరించారు.
అర్ధరాత్రి అశోక్ బాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే ఆయనపై కక్ష సాధిస్తున్నారని ధ్వజ మెత్తారు. ఇది కోర్టులో నిలబడే కేసు కాదని, అక్కడే పోరాడి తేల్చుకుందామని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.