చిన్నారి తలపై నుంచి దూసుకెళ్లిన వ్యాన్.. చక్రాల కింద పడి మృత్యువాత.. తల్లి, అమ్మమ్మ కళ్లెదుటే..

Published : Feb 12, 2022, 10:49 AM IST
చిన్నారి తలపై నుంచి దూసుకెళ్లిన వ్యాన్.. చక్రాల కింద పడి మృత్యువాత.. తల్లి, అమ్మమ్మ కళ్లెదుటే..

సారాంశం

రోడ్డు రక్తమోడింది. చిన్నారి తలను చిదిమేసింది. వేగంగా దూసుకొచ్చిన వ్యాన్.. ఓ పసిదాని ఉసురు తీసింది. అమ్మమ్మ, అమ్మతో కలిసి టూ వీలర్ మీద వెడుతున్న చిన్నారి తల మీదినుంచి వ్యాన్ చక్రాలు దూసుకెళ్లాయి. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.

తూర్పుగోదావరి : అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నామన్న ఆనందం ఆ చిన్నారిలో క్షణమైనా నిలువలేదు. accident రూపంలో మృత్యువు కబళించింది. తల్లి, అమ్మమ్మతో వెళ్తుండగా road accident జరిగింది. ద్విచక్ర వాహనాన్ని వ్యాన్ ఢీ కొట్టింది. చిన్నారి headపై నుంచి వ్యాన్ చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఊహించని ప్రమాదంలో తమ కలల ప్రతిరూపం కళ్లెదుటే చనిపోవడంతో తల్లి, అమ్మమ్మ రోదించిన తీరు కంటతడి పెట్టించింది.

తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో తోట సుమన్ విధులు నిర్వహిస్తున్నారు.  డ్యూటీ లో భాగంగా అంతర్వేదికి మూడు రోజులపాటు  వెళ్ళాడు. దీంతో కుమార్తె, మనవరాలిని ఇంటికి తీసుకెళ్లేందుకు సుమన్ అత్త దుర్గ భవాని పత్తిపాడు వచ్చి  ఇద్దరినీ ద్విచక్రవాహనం మీద వేమగిరి తీసుకెళుతుంది, ఈ క్రమంలో రాజానగరం వద్ద వెనక నుంచి అతివేగంగా వచ్చి.. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది ఓ వ్యాన్.

అంతేకాకుండా ఆగకుండా వెళ్ళిపోయింది. ఈ ఘటనలో బాలిక తల పైనుంచి వ్యాన్ వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి, అమ్మమ్ మరోవైపు పడిపోవడంతో వారికి స్వల్ప గాయాలయ్యాయి. చిన్నారి మృతి తో తల్లి స్వరూప, అమ్మమ్మ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించాయి. మృతదేహాన్ని  రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

ఇదిలా ఉండగా, శుక్రవారం నాడు సూర్యాపేట జిల్లాలో ఇలాంటి విషాద ఘటనే జరిగింది.  తెలంగాణ రాష్ట్రంలోని Suryapeta Districtలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట 45 నిమిషాల ప్రాంతంలో ఘోర Road accident సంభవించింది. జిల్లాలోని ఆత్మకూరు (ఎస్) మండలం వశింపేట గ్రామం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్ లు ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.

ప్రమాద స్థలంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. మరో యువకుడు ఆస్పత్రిలో Treatment పొందుతూ చనిపోయాడు. మృతులను అరవింద్, నవీన్, వినేష్, ఆనంద్ లుగా గుర్తించారు. బైక్ ల అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. యువకులకు చెందిన బైక్ లో మద్యం బాటిల్ కూడా ఉన్నట్లు సమాచారం. నలుగురు యువకుల్లో ఒకరు తొమ్మిదో తరగతి, మరో యువకుడు పదో తరగతి చదువుతున్నట్లు తెలుస్తోంది.

కాగా, గురువారం కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట వద్ద ఓ కారు బావిలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బావిలో నీరు ఎక్కువగా వుండటంతో .. కారు కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టారు. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

బావిలోంచి కారును జేసీబీ సహాయంతో బయటకు తీశారు. గజ ఈతగాళ్ల సాయంతో దాన్ని వెలికి తీశారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురు కూడా మృత్యువాత పడ్డారు. కారు పడిన బావి రోడ్డుకు 30 అడుగుల దూరంలో ఉంది. అతి వేగం కారణంగానే కారు బావిలో పడినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు రెండు పల్టీలు కొట్టి బావిలో పడిందని చెబుతున్నారు. కారు నెంబర్ ఏపీ 39 ఎల్ 4059. 

PREV
click me!

Recommended Stories

YS Jagan Ibrahimpatnam Tour: జగన్ పర్యటనలో జనసంద్రమైన రోడ్లు| Asianet News Telugu
YS Jagan Visits Jogi Ramesh House: జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన జగన్ | Asianet News Telugu