సంచలనం: రేపే ఎంపీ పదవికి జేసీ దివాకర్ రెడ్డి రాజీనామా

First Published Jul 19, 2018, 6:32 PM IST
Highlights

ఎంపీ పదవికి రాజీనామా చేయాలని  జేసీ దివాకర్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు.  అవిశ్వాసంపై ఓటింగ్ జరిగిన తర్వాత  ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. అవిశ్వాసంపై చర్చలో పాల్గొంటానని ప్రకటించారు

అనంతపురం:ఎంపీ పదవికి రాజీనామా చేయాలని  జేసీ దివాకర్ రెడ్డి నిర్ణయం తీసుకొన్నారు.  అవిశ్వాసంపై ఓటింగ్ జరిగిన తర్వాత  ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. అవిశ్వాసంపై చర్చలో పాల్గొంటానని ప్రకటించారు. టీడీపీలో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరికి దక్కిన గౌరవం తనకు దక్కడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు చెప్పారు.


అనంతపురంలో రోడ్ల విస్తరణకు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే  జీవో జారీ చేసింది.ఈ జీవో జారీ చేయడానికి ముందు అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని అమరావతికి పిలిపించుకొని చంద్రబాబునాయుడు మాట్లాడారు.

అయితే అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని అమరావతికి పిలిపించుకొని మాట్లాడడం పట్ల  జేసీ దివాకర్ రెడ్డి  తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. పార్టీలో ప్రభాకర్ చౌదరికి ఉన్న విలువ తనకు లేదని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. త

కొద్దిసేపటి క్రితం టీడీపీలో కీలకమైన నేత ఒకరు జేసీ దివాకర్ రెడ్డికి ఫోన్ చేశారు. సుమారు అరగంటపాటు జేసీ దివాకర్ రెడ్డితో చర్చించారు.  పార్లమెంట్‌లో అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు చేస్తామని ప్రకటించారు. కానీ ఓటింగ్  పూర్తైన తర్వాత తాను ఎంపీ పదవికి రాజీనామా చేయనున్నట్టు  చెప్పారు.

అయితే టీడీపీలో తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై  ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే  జేసీ దివాకర్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నట్టు చెబుతున్నారు.


పార్టీ పరువును కాపాడాలనే ఉద్దేశ్యంతోనే అవిశ్వాసంపై జరిగే చర్చలో పాల్గొనాలని  ఆయన భావిస్తున్నారు. అయితే జేసీ దివాకర్ రెడ్డిని బుజ్జగించేందుకు  టీడీపీ నాయకత్వం ఇవాళ ఉదయం నుండి ప్రయత్నాలు చేస్తోంది. ఆఖరుకు ఆయన డిమాండ్ మేరకు  రోడ్ల విస్తరణ జీవోలు జారీ చేసినా  కానీ ఆయన శాంతించలేదు.

వచ్చే ఎన్నికల్లో  ప్రభాకర్ చౌదరి  విజయం సాధించబోడని  దివాకర్ రెడ్డి పార్టీ నేతలకు తెగేసి చెప్పాడనే ప్రచారం సాగుతోంది.  అయితే  ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని  తాను రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకొన్నాడని  చెప్పారు. అయితే ఇంకా అనేక ఇతర కారణాలు కూడ  ఉన్నాయా అనే కోణంలో కూడ టీడీపీ భావిస్తోంది.

 

click me!