టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత

Published : Jun 20, 2019, 02:12 PM IST
టీడీపీ ఎంపీ గరికపాటికి అస్వస్థత

సారాంశం

టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావుకు అస్వస్థతకు గురయ్యారు. రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్ కు వెళ్లే సమయంలో బీపీ తగ్గిపోవడంతో.. అకస్మాత్తుగా ఆయన కిందపడిపోయారు. 

టీడీపీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహనరావుకు అస్వస్థతకు గురయ్యారు. రాజ్యసభ నుంచి ఛైర్మన్ ఛాంబర్ కు వెళ్లే సమయంలో బీపీ తగ్గిపోవడంతో.. అకస్మాత్తుగా ఆయన కిందపడిపోయారు.  ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేష్‌ గరికపాటికి సపర్యలు చేసి, వైద్యులను పిలిపించి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం ఆర్‌ఎంఎల్‌ ఆసుపత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా... గరికపాటి, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లు టీడీపీని వీడి బీజేపీలో చేరనున్నారు. ఈ మేరకు ఇప్పటికే మోదీ, అమిత్ షాలతో భేటీ అయ్యారు. బీజేపీతో అనుబంధంగా ఉండేందుకు వారి నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 

ఈ నేపథ్యంలో నలుగురు ఎంపీల బాధ్యతను బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు అప్పగించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. సాయంత్రం ఈ నలుగురు రాజ్యసభచైర్మన్ వెంకయ్యనాయుడుకు లేఖ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్