కాంగ్రెస్ పార్టీ తల్లిని చంపింది, బిజెపి కూడా అదే పని చేస్తోంది : గల్లా జయదేవ్

First Published Jul 20, 2018, 12:36 PM IST
Highlights

కాంగ్రెస్ పార్టీ తెలుగు తల్లిని చంపేసి బిడ్డలను ఇచ్చిందన్న ప్రధాని మోదీ గతంలో చెసిన విమర్శలను గల్లా జయదేవ్ పార్లమెంట్ లో ప్రస్తావించారు. అయితే బిడ్డలకు తగిన న్యాయం చేస్తానని ప్రధాని హామీ ఇచ్చారు. కానీ చివరకు ఆయన కూడా కాంగ్రెస్ బాటలోనే నడుస్తూ ఆ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారని గల్లా జయదేవ్ పార్లమెంట్ లో ప్రస్తావించారు.

ఇవాళ తెలుగు దేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాన తీర్మానం సందర్భంగా జరిగిన చర్చను ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కేంద్ర ప్రభుత్వం ఏపికి ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బిజెపి కలిసి ఏపికి అన్యాయం చేశాయని గల్లా మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా చీల్చి అన్యాయం చేసిందని అన్నారు. పార్లమెంట్ తలుపులు మూసి మరీ అన్యాయంగా విభజనను చేపట్టిందని ఆయన మండిపడ్డారు.

ఇక ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బిజెపి పార్టీ నమ్మించి మోసం చేసిందని అన్నారు. ఎన్నికల సమయంలో ఏపీకి అన్ని విధాల ఆదుకుంటామని, ప్రత్యేక హోదా ఇస్తామని స్వయంగా ప్రధానమంత్రి  హామీ ఇచ్చారని గల్లా గర్తుచేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఇచ్చిన హామీనే ప్రధాని విస్మరించారని, ప్రత్యేక హొదా విషయంలో వెనక్కి తగ్గారని గల్లా మండిపడ్డారు.

click me!