
కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసతీర్మానానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. ఈ రోజు పార్లమెంట్ లో ఈ విషయంపై చర్చ జరగనున్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ విషయంపై పవన్ ట్విట్టర్ లో స్పందించారు.
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రజల పక్షాన కేంద్రాన్ని కోరుతున్నట్లు పవన్ తెలిపారు. టీడీపీతో చెడినందున... వారిపై కోపంతో ప్రత్యేక హోదా నిరాకరించటం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రజల హక్కులు సాధించుకునేందుకు, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు పార్లమెంటు సరైన వేదికగా భావిస్తున్నట్లు పవన్ పేర్కొన్నారు.