ఏపీ ప్రజలను ఫూల్స్ చేశారు: మోడీ సర్కార్‌పై గల్లా

Published : Feb 07, 2019, 04:41 PM IST
ఏపీ ప్రజలను ఫూల్స్ చేశారు: మోడీ సర్కార్‌పై గల్లా

సారాంశం

మోడీ ప్రభుత్వం బ్యాండ్ ఎయిడ్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు.

న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం బ్యాండ్ ఎయిడ్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విమర్శించారు.

గురువారం నాడు  ఆయన పార్లమెంట్‌లో  కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రసంగించారు. ఇప్పటి బడ్జెట్‌కు  ఎలాంటి బాధ్యత లేదన్నారు.  ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను  మోడీ అమలు చేయలేదని  గల్లా గుర్తు చేశారు. పదేళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని  ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్నారు.

ఇచ్చిన హామీలను అమలు చేయకుండా  ఏపీ ప్రజలను పూల్స్ చేశారని చెప్పారు. తాను రెండో సారి మోసపోవాలనుకోవడం లేదన్నారు. ఒక్కసారి మోసపోతే మీకు అవమానం, రెండో సారి మోసపోతే మాకు అవమానమన్నారు.

పెద్ద నోట్ల రద్దు, పద్దతి లేని జీఎస్టీ కారణంగా  మధ్యతరగతి ప్రజలు, వ్యాపారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని జయదేవ్ అభిప్రాయపడ్డారు.దేశ ఆర్థిక వ్యవస్థకు లైఫ్ సర్జరీ చేయాల్సిన సమయంలో కేంద్రం బ్యాండ్ ఎయిడ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందన్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం