ప్రేమ పెళ్లి.. కాపురానికి తీసుకెళ్లాలంటూ యువతి ఆందోళన

Published : Feb 07, 2019, 04:38 PM IST
ప్రేమ పెళ్లి.. కాపురానికి తీసుకెళ్లాలంటూ యువతి ఆందోళన

సారాంశం

ప్రేమించి పెళ్లి చేసుకొని..తనను కాపురానికి మాత్రం తీసుకువెళ్లడం లేదంటూ.. ఓ యువతి ఆందోళనకు దిగింది. 

ప్రేమించి పెళ్లి చేసుకొని..తనను కాపురానికి మాత్రం తీసుకువెళ్లడం లేదంటూ.. ఓ యువతి ఆందోళనకు దిగింది. ఈ సంఘటన గుంటూరు జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అచ్చంపేట పోలీస్ స్టేషన్ ఎదుట లావణ్య అనే వివాహిత ధర్నా చేపట్టింది. ఆమెకు ఇటీవల ట్రైయినీ ఎస్సైని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అతను కనిపించకుండా పోయాడు. కనీసం తనను కాపురానికి కూడా తీసుకువెళ్లలేదు. అతను అచ్చంపేటలో ఎస్ఐ గా శిక్షణ పొందుతున్నాడనే విషయం తెలుసుకొని.. అక్కడి వచ్చి ధర్నా చేపట్టింది.

తనకు న్యాయం జరిగే వరకు స్టేషన్ ముందు నుంచి కదలనని ఆమె భీష్మించుకు కూర్చుంది. తన భర్త వచ్చి తననకు కాపురానికి తీసుకెళ్లేంత వరకు తన ధర్నా కొనసాగిస్తానని ఆమె చెప్పింది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఏపీలో మరో హైటెక్ సిటీ.. కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం, మరిన్ని సంస్థలు
Telangana Rains : తెలంగాణలో వర్షాలు.. సంక్రాంతి పండగవేళ వాతావరణం ఎలా ఉంటుందంటే...