తెలంగాణకు కూడా బందరు పోర్టు వల్ల ఉపయోగమే: చంద్రబాబు

By Arun Kumar PFirst Published Feb 7, 2019, 4:32 PM IST
Highlights

ఆంధ్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మచిలీపట్నం వద్ద చేపడుతున్న బందరు పోర్టు తెలంగాణ, కర్ణాటక వంటి ఇంటర్ లాక్ రాష్ట్రాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఏపి సీఎం చంద్రబాబు తెలిపారు.  ఇక ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ముఖ్యంగా నూతనంగా నిర్మిస్తున్న రాజధాని అమరావతి అతి దగ్గర్లో వుండటంతో ఈ పోర్టు ద్వారా భారీ వాణిజ్యాభివృద్ది జరగనున్నట్లు చంద్రబాబు తెలిపారు. 

మచిలీపట్నం బందరు పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఆంధ్ర ప్రజలందరి  కల నిజమయ్యే రోజు ఇదని అన్నారు. ఈ పోర్టు నిర్మాణం చేపడుతున్న నవ యుగ  కంపనీపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఇది మామూల కంపనీల మాదిరిగా పనిచేయదని... ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఓ పద్దతి ప్రకారం పనిచేస్తుందని అన్నారు. ఇలాంటి కంపనీ చేపడుతున్న ఈ పోర్టు నిర్మాణం అనుకున్న సమయానికి  జరుగుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం  ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అందువల్ల నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఎల్లవేళలా సహకారం, అండదండలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇక్కడి ప్రజా ప్రతినిధులు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంకోసం ఎలాంటి సహాయం కావాలన్నా అందించాలని చంద్రబాబు సూచించారు. 

ఈ ప్రాంత ప్రజాప్రతినిధుల శ్రద్ద  వల్లే ఈ ప్రాజెక్టు ఇంత త్వరగా నిర్మాణ దశకు చేరుకుందన్నారు. తెలుగు దేశం పార్టీ పట్టుదల, ప్రజలపై వున్న అభిమానంతోనే ఈ పోర్టు నిర్మాణం చేపట్టడం జరుగుతోందన్నారు.  మరో రెండేళ్లలో మళ్లీ తానే ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.  పోర్టు నిర్మాణం పూర్తిచేసి ఈ ప్రాంతానికి పూర్వ వైభవం తీసువచ్చే బాధ్యత తనదని చంద్రబాబు హామీ ఇచ్చారు. 

click me!