
నోట్ల రద్దుపై మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోడిపైనే బాణాలు ఎక్కుపెడుతోంది. కలుగులో నుండి ఎలుకలు బయటకు వచ్చినట్లుగా నోట్ల రద్దుపై రోజులు గడిచేకొద్దీ ఒక్కొక్క నేతా తమ అభిప్రాయాలను చెబుతున్నారు. తాజాగా నరసరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు మోడిపపై విరుచుకుపడటం గమనార్హం.
నోట్ల రద్దుతో ప్రధానమంత్రి పేదల గొంతు నొక్కినట్లు వాపోయారు. నల్లధనం వెలికితీత పేరుతో చేసిన నోట్ల రద్దు వల్ల చివరకు పేదలే ఇబ్బందులు ప డుతున్నట్లు వ్యాఖ్యానించారు. నోట్ల రద్దుతో ప్రధాని మరక అంటించుకున్నారన్నారు. పెద్దలను వదిలేసి పేదల గొంతు నొక్కటం వల్ల ఎటువంటి ఉపయోగాలు లేవని చెప్పారు.
ఓ వైపే అధినేత చంద్రబాబునాయడు సిఎంల కమిటికీ కన్వీనర్ గా సమావేశాలు నిర్వహిస్తున్నారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ, కమిటీల పేరుతో చివరకు చంద్రబాబుకు కూడా ప్రధాని బురద అంటిస్తున్నట్లు మండిపడ్డారు.