ఈ లెక్కలు నాకు కావాలి .. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి యనమల రామకృష్ణుడు లేఖ

ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ నేత, శాసనమండలిలో విపక్షనేత యనమల రామకృష్ణుడు శనివారం లేఖ రాశారు . ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, విద్యుత్ సంస్థలకున్న బకాయిలు, ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధుల ఖర్చు లెక్కలు అందించాలని రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 


ఏపీ ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి టీడీపీ నేత, శాసనమండలిలో విపక్షనేత యనమల రామకృష్ణుడు శనివారం లేఖ రాశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారి రావత్‌కు తాము లేఖ రాసినా ఆయన వివరాలు ఇవ్వకపోవడంతో మంత్రి బుగ్గనకు యనమల లేఖ రాశారు. విపక్షనేతగా తాను అడిగిన వివరాలు ఇవ్వాలని రామకృష్ణుడు కోరారు. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గాను కాగ్ ఇచ్చిన నివేదికను ఆయన లేఖలో ప్రస్తావించారు. 67 ప్రభుత్వ రంగ సంస్థలు ఆడిట్ సంస్థకు లెక్కలు సమర్పించకపోవడంపై యనమల ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 

ALso Read: కోట్లు చేతులు మారాయా, చంద్రబాబును ఎవరు చంపుతారు .. దొంగ ఏడుపులు : నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి

Latest Videos

కాగ్ నివేదిక ఆందోళన కలిగిస్తోందని.. ఐదేళ్లలో తాము 1.39 లక్షల కోట్ల అప్పులు చేస్తే అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారని రామకృష్ణుడు గుర్తుచేశారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడింతల మేర 3.25 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో 97 పబ్లిక్ సెక్టార్ సంస్థలుంటే 30 సంస్థలే ఆడిట్ లెక్కలు చూపాయని కాగ్ స్వయంగా చెప్పిందని రామకృష్ణుడు లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి ఏపీ అప్పులు ఎంత అన్నది తెలియజేయాలని యనమల కోరారు. ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, విద్యుత్ సంస్థలకున్న బకాయిలు, ఎస్సీ, ఎస్టీ, సబ్ ప్లాన్ నిధుల ఖర్చు లెక్కలు అందించాలని రామకృష్ణుడు డిమాండ్ చేశారు. 

click me!