
టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవలే గుండెకు ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ క్రమంలో గురువారం అర్జునుడు తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. ఆయన మరణం పట్ల టీడీపీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
జనవరి 29న బచ్చుల అర్జునుడికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అర్జునుడిని పరిశీలించిన వైద్యులు అనంతరం స్టంట్ వేశారు. ఈ క్రమంలో ఆయనను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పలువురు నేతలు పరామర్శించారు.