సుబ్రమణ్యం హత్య కేసు : ఆ సమయంలో అనంతబాబుతో ఆయన భార్య.. కేసులో కొత్త ట్విస్ట్...

Published : May 24, 2022, 01:17 PM ISTUpdated : May 24, 2022, 01:23 PM IST
సుబ్రమణ్యం హత్య కేసు : ఆ సమయంలో అనంతబాబుతో ఆయన భార్య.. కేసులో కొత్త ట్విస్ట్...

సారాంశం

మాజీ డ్రైవర్ హత్య కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కట్టుకథలు చెప్పాడా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవతున్నాయి. శంకర్ టవర్స్ దగ్గర ఎలాంటి ఘర్షణా జరగలేదని అక్కడి వాచ్ మెన్ చెబుతున్నాడు.   

కాకినాడ : సుబ్రహ్మణ్యం హత్యను ఎమ్మెల్సీ Ananta babu పక్కా ప్లాన్ ప్రకారమే చేశారా? పోలీసులకు కట్టు కథలు చెప్పి కళ్ళు గప్పారా?  Shankar Towers దగ్గర అనంత బాబుకు, సుబ్రమణ్యానికి అసలు ఘర్షణే జరగలేదా? శంకర్ టవర్స్ దగ్గరికి వచ్చేసరికి సుబ్రహ్మణ్యం మరణించాడా? అంటే అవుననే అంటున్నారు శంకర్ టవర్స్ వాచ్మెన్, సుబ్రహ్మణ్యం చిన్నాన్న. అసలు murder జరిగిన రోజు రాత్రి శంకర్ టవర్స్ దగ్గర అసలు ఎలాంటి ఘర్షణ జరగలేదని బల్లగుద్ది మరీ చెబుతున్నారు. టెన్ టీవీ కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి.. 

తాను గేటు పక్కనే ఉంటానని.. అలాంటిది ఏం జరిగినా తనకు తెలుస్తుందని వాచ్మెన్ అంటున్నారు.. అంతేకాక శంకర్ టవర్స్ కు అసలు సుబ్రమణ్యం రానే రాలేదని వాచ్ మెన్ అంటున్నారు. ఎమ్మెల్సీ అనంత బాబు అబద్ధాలు చెబుతున్నారు అంటున్నారు. అనంత బాబు సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లారని.. మళ్లీ రాత్రి 1:00 కి తిరిగి వచ్చారని.. ఆ సమయంలో అనంత బాబుతో మేడం కూడా ఉన్నారని తెలిపారు.  రాత్రి ఒంటిగంటకు భార్యతో కలిసి పైకి వెళ్లారని మళ్లీ కిందికి  అనంత బాబు  ఒక్కరే  వచ్చారు అన్నారు.

అపార్ట్మెంట్ లో ఉన్న సీసీ టీవీ పుటేజ్ ని ఇప్పటికే పోలీసులు తీసుకున్నారని.. అందులో కూడా ఎలాంటి గొడవ రికార్డు కాలేదని సుబ్రమణ్యం చిన్నాన్న చెప్పారు. సుబ్రమణ్యం చిన్నాన్న చెబుతుందే నిజమైతే అనంత బాబు పోలీసులకు కట్టు కధ చెప్పినట్టు కన్ఫర్మ్ అయినట్టే. రాత్రి 1:00 సమయంలో అనంత బాబుతో ఆయన భార్య కూడా ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. సుబ్రహ్మణ్యం హత్య జరిగినప్పుడు ఆయన భార్య కూడా అక్కడే ఉన్నారా? అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. 

ఇదిలా ఉండగా, సంఘటన జరిగిన రోజు (19) సుబ్రహ్మణ్యం ఇంటి నుంచి ఎనిమిది గంటల ప్రాంతంలో బయటికి వచ్చాడు. మిత్రులతో కలిసి మద్యం కొన్నాడు. శ్రీరామ్ నగర్ ఏరియాలో ఓల్డ్ నవభారత్ స్కూల్ ప్రాంగణంలో రాత్రి 10:15 వరకు మద్యం తాగారు. ఆ తర్వాత రోడ్డుపైకి వచ్చేసరికి అదే సమయంలో ఎమ్మెల్సీ అనంత బాబు తన కారులో అటుగా వచ్చారు. సుబ్బును పిలిచి వాహనంలోకి ఎక్కించుకున్నారు. మిగితా మిత్రులు వెళ్లిపోయారు. అదే వాహనంలో ముందుకు వెళ్లి టిఫిన్ కట్టించుకుని.. 10:30 సమయంలో తిరిగి ఎమ్మెల్సీ నివాసం వైపు వెళ్లారు. నీ పెళ్లి సమయంలో ఇచ్చిన అప్పు ఇంకా రూ.20,000 తిరిగి ఇవ్వలేదని ఆనంతబాబు అడగటంతో ఇచ్చేస్తానని సుబ్రహ్మణ్యం చెప్పాడు.

‘నువ్వు ప్రవర్తన మార్చుకుంటే నా దగ్గర పనిలో పెట్టుకుంటా.. కానీ నీలో మార్పు రాలేదు’ అని ఎమ్మెల్సీ అనడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అనంతబాబు అహం దెబ్బతిని సుబ్రమణ్యం మెడ పట్టుకుని వెనక్కి నెట్టాడు. ఆ వేగానికి సుబ్రమణ్యం అపార్ట్మెంట్ డ్రైనేజీ గట్టుపై పడటంతో తలకు గాయమైంది. ‘నన్నే కొడతావా’.. అని కోపంతో అతను మళ్ళీ  తిట్టడంతో  అనంత బాబు రెండోసారి బలంగా కొట్టాడు. దీంతో గ్రిల్స్ కు తగిలి తలకు మళ్లీ గాయమైంది. అనంత బాబు అతడిని వాహనంలో ఎక్కించుకుని 2 ఆస్పత్రులకు తిరిగాడు. కానీ అవి మూసి వేసి ఉన్నాయి.  కారులో వస్తుండగా సుబ్రమణ్యానికి ఎక్కిళ్లు రావడంతో అనంత బాబు నీళ్లు ఇచ్చాడు. అది తాగాక కొంతసేపటికి ఉలుకూ పలుకూ లేకపోవడంతో పరీక్షించగా శ్వాస ఆగిపోయింది అని గుర్తించాడు. దీన్ని ప్రమాదం సృష్టిస్తే అనుమానం రాదని అనంత బాబు భావించాడు. 

స్థానిక జీ కన్వెన్షన్ సెంటర్ లో ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించాలని చూశాడు.. అక్కడ ట్రాఫిక్ ఉండడంతో డంపింగ్ యార్డ్ ప్రాంతానికి తీసుకు వెళ్ళాడు. అక్కడ సుబ్రమణ్యం మృతదేహాన్ని కింద పడుకోబెట్టి ప్రమాదంలో గాయపడినట్లు చూపడానికి.. చెట్టుకొమ్మతో తొడలు, భుజం, వీపుపైన కొట్టాడు. తర్వాత మృతదేహాన్ని అక్కడున్న తాడుతో కట్టేసి వాహనంలో ఎక్కించాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చి 12:30 ప్రాంతంలో మృతుడి తల్లికి ఫోన్ చేసి ప్రమాదం జరిగినట్టు నాకు సమాచారం వచ్చింది.. నేను అక్కడికి వెళ్తున్నాను... అని నమ్మబలికాడు. కాసేపటికి మళ్ళీ వారికి కాల్ చేసి, నేను మృతదేహాన్ని తీసుకు వస్తున్నాను అని చెప్పాడు.  ఇంటికి రాగానే మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు అది ప్రమాదం కాదని అనుమానించారు. ఎమ్మెల్సీని నిలదీయడంతో ఆయన కారు వదిలి వేరే ద్విచక్రవాహనంపై అక్కడి నుంచి పరారయ్యాడు.

ఆధారాలు తారుమారు చేసే ప్రయత్నంలో మృతదేహంపై  గాయాలు చేయడం, హత్య, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద సెక్షన్లు మార్చి అనంత బాబును అరెస్టు చేశామని ఎస్పీ చెప్పారు. అవసరమైతే మరోసారి పోలీసు కస్టడీకి తీసుకుని విచారిస్తామన్నారు. రూ. 20 వేల కోసమే హత్య చేశాడా? వివాహేతర సంబంధాల నేపథ్యమా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు వాస్తవాల ప్రకారమే దర్యాప్తు ఉంటుందని ఇది ఫైనల్ కాదని సమాధానం ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu