అర్థరాత్రి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అరెస్ట్..

By SumaBala Bukka  |  First Published Feb 11, 2022, 6:41 AM IST

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు‌ను గురువారం అర్థరాత్రి సీఐడీ అరెస్ట్ చేసింది. జనవరి 25న సర్వీసు రికార్డుల్లో తప్పుడు సమాచారం ఇచ్చారనే ఆరోపణలపై ఏపీ సీబీ సీఐడీ అధికారులు ఆయనపై కేసు కేసు నమోదు చేశారు. ఈ మేరకు లోకాయుక్త ఆదేశాలతో అదుపులోకి తీసుకున్నారు.


అమరావతి : టిడిపి ఎమ్మెల్సీ Paruchuri Ashok Babuను గురువారం రాత్రి సిఐడి అధికారులు అరెస్టు చేశారు. Vijayawadaలోని ఆయన నివాసం నుంచి రాత్రి 11.30 గంటల సమయంలో తరలించారు గురువారం రాత్రి ఓ వివాహ వేడుకకు హాజరైన అశోక్ బాబు రాత్రి 11.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ మఫ్టీలో మాటువేసిన సిఐడి పోలీస్ ఆయనను అరెస్టు చేసి, వాహనంలో తరలించారు. అశోక్ బాబును అరెస్టు చేసినట్లు.. కోర్టులో హాజరు పరిచినట్లు సమాచారం ఇస్తూ ప్రకాశం జిల్లా కందుకూరు వాసి మాదాల గోపికి నోటీసు అందించారు.

అశోక్ బాబు వాDepartment of Commercial Taxesలో పనిచేసే సమయంలో బీకాం డిగ్రీ చదవకపోయినా.. చదివినట్లు తప్పుడు పత్రాలు సమర్పించారని.. మరికొన్ని ఆరోపణలతో విజయవాడ వాసి మెహర్ కుమార్ లోకాయుక్తకు గతంలో ఫిర్యాదు చేశాడు. విచారణ జరిపిన 
Lokayukta.. వాణిజ్య పన్నుల శాఖ నుంచి నివేదిక తెప్పించుకున్నారు. సమగ్ర దర్యాప్తు కోసం సిఐడికి ఫిర్యాదు చేయాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.  

Latest Videos

undefined

ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ సంయుక్త కమిషనర్ డి. గీతామాధురి ఇటీవల అశోక్ బాబుపై సిఐడి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఐపీసీ 477 ఏ, 465, 420 తదితర సెక్షన్ల కింద గత నెల 25న కేసు నమోదయింది.  దర్యాప్తులో భాగంగా ఆయనను అరెస్టు చేశారు.

సర్వీస్ మేటర్స్ లో తప్పుడు కేసులో ఇరికించారు :  చంద్రబాబు
టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తున్నందున ప్రభుత్వం ఆయనపై కక్షకట్టిందని అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్వీస్ మేటర్స్ లో తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. అర్ధరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీశారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రతి తప్పుకు మూల్యం  చెల్లించక తప్పదు అని ఆయన హెచ్చరించారు. 

అర్ధరాత్రి అశోక్ బాబును అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు.  ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతున్నందుకే ఆయనపై కక్ష సాధిస్తున్నారని ధ్వజ మెత్తారు. ఇది కోర్టులో నిలబడే కేసు కాదని, అక్కడే పోరాడి తేల్చుకుందామని టిడిపి అధికార ప్రతినిధి పట్టాభిరామ్ అన్నారు.

ఇదిలా ఉండగా, ఆంధ్ర ప్రదేశ్ లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని టిడిపి ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు ఫిబ్రవరి 8న ఆరోపించారు. తమకు జరిగిన మోసానికి తగిన సమయంలో ఉద్యోగులు రివేంజ్ తీర్చుకుంటారని... సీఎం జగన్ కు ఉద్యోగుల నుండి రిటర్న్ గిప్ట్ ఖాయమని అశోక్ బాబు హెచ్చరించారు. 

''న్యాయబద్దమైన డిమాండ్ల కోసం ఉద్యోగులు చేపట్టిన ఉద్యమం వెనుక టీడీపీ హస్తముందంటూ స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగనే మాట్లాడటం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనం. ఉద్యోగుల న్యాయబద్ద పోరాటానికి టీడీపీ అండగా ఉంటుంది'' అని అశోక్ బాబు పేర్కొన్నారు.

click me!