సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏపీ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు

Siva Kodati |  
Published : Feb 10, 2022, 08:31 PM ISTUpdated : Feb 10, 2022, 08:35 PM IST
సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏపీ హైకోర్టుకు కొత్తగా ఏడుగురు న్యాయమూర్తులు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (andhra pradesh high court) ఏడుగురు జడ్జిల నియామకానికి రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) ఆమోదముద్ర వేశారు.సుప్రీంకోర్టు (supreme court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ (justice nv ramana) నేతృత్వంలోని కొలీజియం (supreme court collegium) ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదన చేసింది. జనవరి 29న జరిగిన కొలీజియం మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (andhra pradesh high court) ఏడుగురు జడ్జిల నియామకానికి రాష్ట్రపతి  రామ్‌నాథ్ కోవింద్ (ramnath kovind) ఆమోదముద్ర వేశారు. దీంతో ఏపీ  హైకోర్టు న్యాయమూర్తులుగా గన్నమనేని రామకృష్ణ ప్రసాద్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు, రాజశేఖర్ రావు, సత్తి సుబ్బారెడ్డి, చీమలపాటి రవి, వడ్డిబోయిన సుజాత, కొనగంటి శ్రీనివాస్ రెడ్డిలను నియమించారు. ఈ ఏడుగురిని హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం ఇటీవల సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు (supreme court) ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ (justice nv ramana) నేతృత్వంలోని కొలీజియం (supreme court collegium) ఈ మేరకు కేంద్రానికి ప్రతిపాదన చేసింది. జనవరి 29న జరిగిన కొలీజియం మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2022 జనవరి 17 నాటికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 37 జడ్జి పోస్టులు మంజూరవగా..  ప్రస్తుతం 20 మంది పనిచేస్తున్నారు. 20 జడ్జ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

PREV
click me!

Recommended Stories

Raghurama Krishnam Raju: కోడిపందాలను ప్రారంభించిన ఏపీ డిప్యూటీ స్పీకర్ RRR | Asianet News Telugu
RK Roja Bhogi Lecebrations With Family: భోగి రోజు రంగురంగు ముగ్గులు వేసిన రోజా| Asianet News Telugu