టిడిపి ఎంఎల్సీ అరెస్ట్

Published : Jun 07, 2017, 08:16 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
టిడిపి ఎంఎల్సీ అరెస్ట్

సారాంశం

భూకబ్జా కేసులో ఈయన్ను క్రైం పోలీసులు మంగళవారం హైదరాబాద్ లో అరెస్టు చేసారు. ఇటీవలే బ్యాంకులకు రుణాలను ఎగొట్టారన్న ఆరోపణలపై నెల్లూరు జిల్లా స్ధానిక సంస్ధల్లో గెలిచిన ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డిపై సిబిఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే కదా?

చంద్రబాబునాయుడును భూకబ్జా కేసులు, ప్రజాప్రతినిధుల అరెస్టులు, సిబిఐ దాడులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయ్. అనంతపురం జిల్లాలో స్ధానిక సంస్ధల్లో గెలిచిన ఎంఎల్సీ దీపక్ రెడ్డి మంగళవారం అరెస్టయ్యారు. ఈయన గతంలో కూడా అరెస్టయి ప్రస్తుతం బెయిల్ పై తిరుగుతున్నారు.

భూకబ్జా కేసులో ఈయన్ను క్రైం పోలీసులు మంగళవారం హైదరాబాద్ లో అరెస్టు చేసారు. ఇటీవలే బ్యాంకులకు రుణాలను ఎగొట్టారన్న ఆరోపణలపై నెల్లూరు జిల్లా స్ధానిక సంస్ధల్లో గెలిచిన ఎంఎల్సీ వాకాటి నారాయణరెడ్డిపై సిబిఐ దాడులు చేసిన సంగతి తెలిసిందే కదా? సిబిఐ దాడులు చేసిందనే వాకాటిని చంద్రబాబు పార్టీ నుండి సస్పెండ్ చేసారు.

దీపక్ రెడ్డి మామూలోడు కాదు. 2012 ఎన్నికల్లో అనంతపురం జిల్లా రాయదుర్గంలో పోటీ చేసినపుడు ఏకంగా రూ. 6 వేల కోట్ల ఆస్తులను చూపించటం అప్పట్లో సంచలనం. ఒక వ్యక్తి వేల కోట్ల రూపాయలు ఎలా ఆస్తులు చూపించారబ్బా అని అందరూ విస్తుపోయారు. ఇపుడు అందరికీ సమాధానం దొరికింది.

ఎలాగంటే, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అనేక చోట్ల వేల ఎకరాల భూములను దీపక్ కబ్జా చేయటం సొంతం చేసేసుకోవటం. ఇదే దీపక్ పని. దీపక్ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే జెసి సోదరులుగా ఫేమస్ అయిన జెసి ప్రభాకర్ రెడ్డికి స్వయానా అల్లుడవ్వటమే.

రాజకీయంగా బలమైన నేపధ్యమున్నందునే యధేచ్చగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ఓ కబ్జా కేసులో షేక్ పేట్ ఎంఆర్ఓ ఫిర్యాదు మేరకు దీపక్ ను పోలీసులు అరెస్టు  చేసారు. దీపక్ పై 6200 ఎకరాలకు సంబంధించిన 11 వివాదాల్లో ఇరుక్కున్నారు.

తాజాగా అరెస్టయిన దీపక్ విషయంలో చంద్రబాబు ఏం చర్య తీసుకుంటారన్న విషయమై పార్టీలో సర్వత్రా చర్చ మొదలైంది. ఎందుకంటే, సిబిఐ దాడులు చేసిందనే వాకాటిని పార్టీ నుండి సస్సెండ్ చేసిన చంద్రబాబు ఇపుడు అరెస్టయిన దీపక్ పై ఏం చర్యలు తీసుకుంటారు?

విశాఖపట్నంలో రూ. 25 వేల కోట్ల భూ కుంభకోణంలో మంత్రితో పాటు పలువురు ఎంఎల్ఏలు ఇరుక్కున్నారు. స్కాంపై ఈనెల 15వ తేదీన విశాఖలో బహిరంగ విచారణ జరుగుతుంది. స్కాం జరిగిందని ఇప్పటికే కలెక్టర్, మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కూడా నిర్ధారించారు. మరి బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది పెద్ద ప్రశ్న.

 

 

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu