అమరావతి నిర్మాణాలూ ఇంతేనా ?

Published : Jun 07, 2017, 07:26 AM ISTUpdated : Mar 25, 2018, 11:58 PM IST
అమరావతి నిర్మాణాలూ ఇంతేనా ?

సారాంశం

అర్ధగంట వర్షం చంద్రబాబునాయుడు ప్రభుత్వం పరువు తీసేసింది. ఇంతకాలం ఆ నిర్మాణాల గొప్పతనం గురించి చంద్రబాబు చెప్పిన ‘ఆహా ఓహో’ మాటలన్నీ ఉత్త కబుర్లుగా తేలిపోయింది. ఇంత నాసిరకం భవనాలకే ప్రభుత్వం సుమారు రూ. 900 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏ స్ధాయిలో ప్రభుత్వంలో అవినీతి జరిగిందో స్పష్టంగా కనబడుతోంది.

వెలగపూడి నిర్మాణాలు చూసిన తర్వాత అమరావతి నిర్మాణంపై అందరిలోను అనుమానాలు మొదలయ్యాయి. మంగళవారం సాయంత్రం కురిసిన చిన్నపాటి వర్షానికే తాత్కాలిక సచివాలయం డొల్లతనం బయటపడింది. ఇక్కడ పోయింది డబ్బు కాదు, ప్రభుత్వ పరువు. వర్షపునీరు లీకుల కారణంగా అనేక ఛాంబర్లలోని ఫర్నీచర్ దెబ్బతిన్నది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఛాంబర్ అయితే పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. ఇంతకాలం చంద్రబాబునాయుడు, కోడెల శివప్రసాద్ చెప్పుకుంటున్న గొప్పలన్నీ అర్ధగంట వర్షానికే తుడిచిపెట్టుకుపోయింది.

కొద్దిపాటి వర్షానికే వందల కోట్ల రూపాయలు వర్షార్పణమైపోయింది. భవనాల్లోపల చాలాచోట్ల దారలుగా వర్షపు నీరే. మొన్నటి వరకూ తమ ప్రభుత్వం ఘనత గురించి చంద్రబాబునాయుడు, కోడెల శివప్రసాద్ ఎక్కడబడితే అక్కడ తెగ పొగిడేసుకున్నారు. వీరికి భాజపా శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు పక్కవాద్యం.

అర్ధగంట కురిసిన వర్షానికే పరిస్ధితి ఇలాగుంటే, రేపటి రోజున ఓ మూడుగంటలు భారీ వర్షం కురిస్తే పరిస్ధితి ఏమిటో తలుచుకుంటేనే ఒళ్ళు జలధరిస్తోంది. అర్ధగంట వర్షం చంద్రబాబునాయుడు ప్రభుత్వం పరువు తీసేసింది.

ఇంతకాలం ఆ నిర్మాణాల గొప్పతనం గురించి చంద్రబాబు చెప్పిన ‘ఆహా ఓహో’ మాటలన్నీ ఉత్త కబుర్లుగా తేలిపోయింది. ఇంత నాసిరకం భవనాలకే ప్రభుత్వం సుమారు రూ. 900 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏ స్ధాయిలో ప్రభుత్వంలో అవినీతి జరిగిందో స్పష్టంగా కనబడుతోంది.

తాత్కాలిక సచివాలయమే పంటపొలాల్లో ఇంతగొప్పగా కడితే ఇక అమరావతి ఇంకెత బ్రహ్మాండంగా ఉంటుందో అన్న అనుమానాలు అందరిలోనూ మొదలయ్యాయి. ఎందుకంటే, పేరుకే సింగపూర్ కన్సార్షియం. మళ్ళీ సబ్ కాంట్రాక్టులు తీసుకుని చేసేది పచ్చ చొక్కా నేతల కంపెనీలే కదా? అంటే నాణ్యత మళ్ళీ ఇదే విధంగా ఉంటుందనటంలో అనుమానమే అక్కర్లేదు.

కాంట్రాక్టులు చేస్తూ డబ్బులు సంపాదించటం కాదు. డబ్బు సంపాదన కోసమే పనులను సృష్టిస్తున్నారు. అందులో భాగమే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణం. అందుకే పనుల్లో నాణ్యత అంత అధ్వాన్నంగా ఏడిచింది.

 

PREV
click me!

Recommended Stories

Chandrababu, Lokesh కి వెంకన్న ప్రసాదం ఇచ్చిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ | Asianet News Telugu
నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu