ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

Published : Sep 15, 2022, 03:43 PM ISTUpdated : Sep 15, 2022, 03:51 PM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ  సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ  సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారాం సస్పెండ్ చేశారు. వికేంద్రీకరణపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం నడించింది. ఈ క్రమంలోనే సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో టీడీపీ సభ్యులను స్పెండ్ చేయాల్సిందిగా స్పీకర్ తమ్మినేనిని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరాడు. ఈ క్రమంలోనే సభ ఆమోదంతో 16 మంది టీడీపీ సభ్యులను ఈరోజు సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా స్పీకర్ ప్రకటించారు. 

అయితే ఈ క్రమంలోనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. పయ్యావుల కేశవ్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరారు. సస్పెండ్‌ అయిన టీడీపీ సభ్యులలో.. బెందాళం అశోక్, కింజారపు అచ్చెన్నాయుడు,  గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి భవాని, నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, పయ్యావుల కేశవ్.. తదితరులు ఉన్నారు.  

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?