మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరిని బుజ్జగించేందుకు మాజీ మంత్రులు కెఎస్ జవహర్, నిమ్మకాయల చినరాజప్ప లు శుక్రవారం నాడు భేటీ అయ్యారు. రాజీనామా విషయాన్ని వెనక్కి తీసుకొనేలా బుచ్చయ్యపై నేతలంతా ఒత్తిడి తీసుకురానున్నారు.
రాజమండ్రి: టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ని బుజ్జగించేందుకు తెలుగుదేశం నాయకత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసింది.
శుక్రవారం నాడు టీడీపీ ఎమ్మెల్యేలు గడ్దె రామ్మోహన్ , నిమ్మకాయల చినరాజప్ప, మాజీ మంత్రి కెఎస్ జవహర్ లు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇంటికి వెళ్లారు.
బుచ్చయ్య చౌదరి రాజీనాామా చేయకుండా ఆయనను బుజ్జగిస్తున్నారు.
also read: బాబును కూడా కలవలేకపోతున్నా.. టీడీపీలో నేను ఒంటరివాడిని, త్వరలోనే రాజీనామాపై ప్రకటన: బుచ్చయ్య చౌదరి
కొంతకాలంగా టీడీపీ నాయకత్వంపై బుచ్చయ్యచౌదరి అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల ప్రకటించిన పార్టీ కమిటీల్లో తన వర్గీయులకు స్థానం కల్పించకుండా ప్రత్యర్థికి పట్టం కట్టబెట్టడంపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ మామా ఆదిరెడ్డి అప్పారావుతో బుచ్చయ్య చౌదరికి మధ్య విబేధాలున్నాయి. పార్టీ కమిటీల్లో అప్పారావు వర్గానికే పెద్దపీట వేయడంతో పాటు కొంతకాలంగా పార్టీలో చోటు చేసుకొంటున్న పరిణామాలపై ఆయన అసంతృప్తితో ఉన్నారు.
పార్టీ సభ్యత్వానికి ;ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి భావిస్తున్నారు. ఈ విషయం తెలిసిన పార్టీ నాయకత్వం బచ్చయ్యను బుజ్జగించే ప్రయత్నాలను మొదలుపెట్టింది.
రెండు రోజుల క్రితం మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు , నిమ్మకాయల చినపాత్రుడులు బుచ్చయ్య చౌదరిని బుజ్జగించారు. గురువారం నాడు టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు కూడ బుచ్చయ్య చౌదరితో ఫోన్‌లో మాట్లాడారు.
శుక్రవారంనాడు మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కెఎస్ జవహర్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లు బుచ్చయ్య చౌదరితో భేటీ అయ్యారు.