ఈ ప్రచారాలను నిజం చేసేలా వంశీమోహన్ ఎంపీ సుజనా చౌదరితో భేటీకావడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాలో ఎంపీ వై సుజనాచౌదరి గాంధీ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నారు. సంకల్పయాత్ర చేస్తుండగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ మెరుపు మెరవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది.
గుంటూరు: కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీలో కీలక నేత ఆయన. చంద్రబాబు నాయుడుకే కాదు నందమూరి కుటుంబానికి కూడా చాలా ఆప్తుడు. చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడుగా మెలుగుతున్నారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గం నుంచి మరోసారి గెలుపొంది వైసీపీ ప్రభుత్వంలో కూడా తన సత్తా చాటారు. ఆయనే వల్లభనేని వంశీమోహన్. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీమోహన్ ను కేసులు వేధిస్తున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో వంశీ గత కొద్దిరోజులుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో కూడా అంతగా పాల్గొనడం లేదు. ఓవైపు కేసులు మరోవైపు పార్టీ అధికారంలో లేకపోవడంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న వంశీ గందరగోళంలో ఉన్నారు.
ఇకపోతే తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని భావిస్తున్న బీజేపీ వంశీమోహన్ కు గాలం వేసిందని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడంలో కీలక పాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి, ఎంపీ సుజనాచౌదరిని రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతుంది.
వల్లభనేని వంశీమోహన్ ను బీజేపీలోోకి రావాలంటూ ఎంపీ సుజనాచౌదరి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీలోని కీలక నేతలు సైతం వంశీకి టచ్ లో ఉన్నారని తెలుస్తోంది.
ఈ ప్రచారాలను నిజం చేసేలా వంశీమోహన్ ఎంపీ సుజనా చౌదరితో భేటీకావడం చర్చనీయాంశంగా మారింది. గుంటూరు జిల్లాలో ఎంపీ వై సుజనాచౌదరి గాంధీ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నారు. సంకల్పయాత్ర చేస్తుండగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఓ మెరుపు మెరవడం అక్కడ చర్చనీయాంశంగా మారింది.
వల్లభనేని వంశీమోహన్, సుజనాచౌదరిల మధ్య కాసేపు చర్చ జరిగినట్లు ప్రచారం జరుగుతుంది. అనంతరం అక్కడ నుంచి ఇద్దరు నేతలు కారులో వెళ్లిపోయారు. తాము ఒంగోలు వెళ్తున్నట్లు చెప్పినట్లు తెలుస్తోంది.
ఒకే కారులో బీజేపీ ఎంపీ సుజనాచౌదరి, టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వెళ్లిపోవడంతో వంశీమోహన్ బీజేపీలో చేరతారు అంటూ ప్రచారం జరుతోంది. ఈ సందర్భంగా ప్రాంతీయ పార్టీలపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు సుజనా.
రాస్ట్రంలో ప్రాంతీయ పార్టీలకు భవిష్యత్ ఉండదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. దేశం బాగుండాలంటే అది ఒక్క బీజేపీతోనే సాధ్యమన్నారు. అందువల్ల ప్రతీ ఒక్కరూ బీజేపీకి మద్దతు ఇవ్వాలంటూ ప్రజలను కోరారు సుజనాచౌదరి.
ఈ వార్తలు కూడా చదవండి
video :పార్టీ మార్పుపై తేల్చేసిన టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ