జగన్ తో నాకు గొడవలు లేవు... పవన్ షాకింగ్ కామెంట్స్

By telugu teamFirst Published Oct 25, 2019, 8:52 AM IST
Highlights

నెల్లూరు జిల్లా జనసేన కార్యకర్తలతో పవన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, జమీన్‌ రైతు పత్రిక ఎడిటర్‌ డోలేంద్రప్రసాద్‌పై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే అడిగే నాథుడే లేరని విమర్శించారు. అధికారం, అంగబలం ఉందని వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని, వైసీపీ వాళ్లు దాడులు చేస్తుంటే అరెస్ట్‌ చేసే దమ్ము పోలీసులకు లేదా అని ప్రశ్నించారు.
 

వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కి పట్టిన గతే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డికి పడుతుందని ఆయన అన్నారు. అంతేకాకుండా... తనకు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తో ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్నారు. 

  బ్రాందీ షాపులు వైసీపీ నేతల కనుసన్నల్లోనే నడుపుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాలని సూచించారు. సీఎం జగన్‌పై తనకు వ్యక్తిగత గొడవలు లేవని పవన్‌కల్యాణ్‌ తెలిపారు.
 
నెల్లూరు జిల్లా జనసేన కార్యకర్తలతో పవన్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోయాయని, జమీన్‌ రైతు పత్రిక ఎడిటర్‌ డోలేంద్రప్రసాద్‌పై వైసీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే అడిగే నాథుడే లేరని విమర్శించారు. అధికారం, అంగబలం ఉందని వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని, వైసీపీ వాళ్లు దాడులు చేస్తుంటే అరెస్ట్‌ చేసే దమ్ము పోలీసులకు లేదా అని ప్రశ్నించారు.

ఇటీవల పవన్ సోదరుడు, సినీ నటుడు, మాజీ ఎంపీ చిరంజీవి... ముఖ్యమంత్రి జగన్ ని కలిసిన సంగతి తెలిసిందే. తాను నటించిన సైరా సినిమాను వీక్షించాల్సిందిగా కోరడానికి చిరంజీవి.. జగన్ ని కలిశారు. అయితే... తొలుత.. పవన్ కారణంగా జగన్... చిరంజీవి కి అపాయింట్మెంట్ ఇవ్వరనే వార్తలు వచ్చాయి. కానీ... ఆ రూమర్స్ కి స్వస్తి పలుకుతూ... జగన్.. చిరుని కలిశారు. అద్భుతమైన సినిమా తీశారని అభినందించడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఇటీవల కూడా పవన్.. జగన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ కేసులున్న వ్యక్తి సీఎం అయితే ఏపని సక్రమంగా చేయలేరని, రాష్ట్రానికి ఏమీ చేయలేరంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెళ్తే కేంద్రమంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేని దుస్థితి అని చెప్పుకొచ్చారు. కేసులు ఉన్నాయి కాబట్టే వారితో జగన్ కొట్లాడలేరని విమర్శించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా కావాలని కేంద్రాన్ని నిలదీయాలంటే సీబీఐ కేసులు అడ్డువస్తాయని వారు గుర్తు చేశారంటే వెనక్కి తగ్గాల్సిందేనన్నారు. అందుకు నిదర్శనమే రెండు రోజుల క్రితం న్యూ ఢిల్లీలో సీఎం జగన్ కు ఎదురైన అనుభవమేనని చెప్పుకొచ్చారు. 

కేంద్రమంత్రులను కలిసేందుకు సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారని కానీ అక్కడ అపాయింట్మెంట్ దొరక్క ఒక్కరోజంతా తన అధికారిక గృహంలోనే గడపాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. మరుసటి రోజు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలు అపాయింట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత క్యాన్సిల్ చేయడం బాధాకరమన్నారు.

సీబీఐ కేసులు ఉన్నాయి కాబట్టే జగన్ వెనుదిరగాల్సి వచ్చిందన్నారు. సీబీఐ కేసులు లేకపోతే కేంద్రాన్నే నిలదీసే పరిస్థితికి వెళ్లేవారని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రాన్ని నిలదీయలేక రాజీపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. సీఎం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చినప్పుడు మరోలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 

జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తనపై కోడికత్తితో దాడి చేసిన కేసు ఏమైందన్నారు. కోడికత్తి దాడి కేసులో ఆంధ్రాపోలీసులపై నమ్మకం లేదని సీబీఐ కోర్టుకు వెళ్తామన్న జగన్ ఆ విషయాలను అధికారంలోకి వచ్చిన వెంటనే మరచిపోయారన్నారు. 

ఇకపోతే ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత చిన్నాన్న మాజీమంత్రి వైయస్ వివేకానందరెడ్డిని అత్యంత కిరాతకంగా హత్య చేసినా దానిపై ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ లేదన్నారు. సీబీఐ విచారణ కోరిన సీఎం జగన్ ఇప్పుడు ఆ కేసును ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. 

ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి కేసుల విషయం మరచిపోయారా...? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన డిమాండ్లు గుర్తుకు రావడం లేదా అని నిలదీశారు. జగన్ మరచిపోయినా తాను మరచిపోలేదని తనుకు అన్నీ గుర్తున్నాయన్నారు.

తనకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అయినా, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అయినా గౌరవమేనని చెప్పుకొచ్చారు. వారితో తనకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారని చెప్పుకొచ్చారు. 151 సీట్లతో అఖండ విజయం సాధించడంతో మరో 20ఏళ్లు సీఎంగా జగనే ఉంటారని తాను రోడ్లెక్కాల్సిన పనిలేదనుకున్నానని చెప్పుకొచ్చారు. 
 

click me!