హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైఎస్ఆర్ పేరును పెట్టడంపై టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తప్పుబట్టారు. వైద్య రంగంలో ఎన్టీఆర్ సంస్కరణలు తీసుకు వచ్చారని ఆయన చెప్పారు.
అమరావతి: హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును మార్చడంతోనే జగన్ సర్కార్ కు రోజులు దగ్గరపడ్డాయని అర్ధమౌతుందని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చెప్పారు. ఈ ప్రభత్వానికి చివరి రోజులు దగగర్లోనే ఉన్నాయని ఈ ఘటన రుజువు చేస్తున్నాయని కేశవ్ తెలిపారు. బుధవారం నాడు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు.
ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రభుత్వం హెల్త్ యూనివర్శిటీ పేరును మార్చిందన్నారు.
హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడాన్ని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తప్పుబట్టారు.రాష్ట్రంలో ఇక ఎవరి పేరు అవసరం లేదనుకుంటున్నారా అని ఆయన సీఎంను ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్ ప్రభుత్వంగా మారిందని ఆయన విమర్శించారు. అహంకారం తలకెక్కితే ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారని పయ్యావుల అభిప్రాయపడ్డారు. సభలో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రభుత్వం ఇలాంటి దుర్మార్గపు చర్యలకు దిగుతోందని పయ్యావుల కేశవ్ విమర్శించారు.ఈ రాష్ట్రాన్ని జగనాంధ్రప్రదేశ్ గా మారుస్తారని ఆయన విమర్శించారు.
undefined
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కార్పోరేట్ ఆసుపత్రులకు మూలం నిమ్స్ ఆసుపత్రి అని ఆయన గుర్తు చేశారు. హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించడంపై తమ స్వంత పార్టీకి చెందిన నేతలతో ఆన్ లైన్ లో అభిప్రాయాలను సేకరించాలని పయ్యావుల కేశవ్ కోరారు. వైసీపీతో పాటు రాష్ట్రంలోని ఇతర పార్టీలకు చెందిన నేతల అభిప్రాయాలను కూడా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును మార్చడాన్ని ఎవరూ కూడా సమర్ధించరని కేశవ్ అభిప్రాయపడ్డారు.
also read:ఎపి అసెంబ్లీలో తీవ్ర గందరగోళం: స్పీకర్ పైకి పేపర్లు విసిరిన టిడిపి ఎమ్మెల్యేలు
వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది ఎన్టీఆర్ అని ఆయన చెప్పారు హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ ఛాన్సిలర్ గా ఉన్నారన్నారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పలువురు మాజీ ముఖ్యమంత్రుల పేర్లను పలు సంస్థలకు పెట్టిన విషయాన్ని పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు.