తనను కించ.పర్చేలా మంత్రి నాగార్జున వ్యాఖ్యలు చేయలేదని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి చెప్పారు. ఈ వ్యాఖ్యలు మంత్రి చేశారని తేలితే మంత్రి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అమరావతి:తన పుట్టుక గురించి మంత్రి నాగార్జున వ్యాఖ్యలు చేయలేదని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయస్వామి చెప్పారు. అసెంబ్లీలో ఏపీ మంత్రి మేరుగ నాగార్జున వ్యవహరించిన తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు. బీఏసీ సమావేశం తర్వాత అసెంబ్లీ తిరిగి ప్రారంభం కాగానే ఈ విషయమై సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య చర్చ జరిగింది.
అయితే తన పుట్టుక గురించి మంత్రి నాగార్జున మాట్లాడితే ఆయన రాజీనామా చేయాలని కోరారు. లేకపోతే తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. దళిత ఎమ్మెల్యేలు సభలోకి రాకుండా వైసీపీ తీరు ఉందన్నారు. మరో అంబేద్కర్ వస్తేనే దళిత ఎమ్మెల్యేలకు న్యాయం జరగదేమోనని ఆయన అభిప్రాయపడ్డారు. దళితులపై చిత్తశుద్ది ఉంటే తన గురించి కించపర్చేలా మాట్లాడిన మంత్రిని భర్తరఫ్ చేయాలని సీఎం జగన్ ను కోరారు. తాను శాసనసభ నియామావళికి విరుద్దంగా మాట్లాడలేదన్నారు. దళిత విద్యార్ధులకు స్టడీ సర్కిల్స్ విషయమై ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి మేరుగ నాగార్జునకు టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు దళిత సామాజిక వర్గంలో పుట్టేందుకు ఎవరైనా ఇష్టపడతారా అనే వ్యాఖ్యలు చేశారా అని మంత్రి నాగార్జున చెప్పారు. తాను టీడీపీ ఎమ్మెల్యే స్వామి గురించి తప్పుగా మాట్లాడలేదన్నారు. చంద్రబాబును ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి వెనకేసుకొస్తున్నారన్నారు.
undefined
అయితే ఈ విషయమై అధికార వైసీపీ, విపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను కించపర్చేలా మంత్రి నాగార్జున వ్యాఖ్యలు చేశారని టీడీపీ ఎమ్మెల్యే స్వామి చెప్పారు. తన పుట్టుక గురించి మంత్రి మాట్లాడడం ఏమిటని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి ప్రశ్నించారు.
ఎవరైనా దళిత కుటుంబంలో పుట్టడానికి ఇష్టపడతారా అని గతంలో చంద్రబాబు అన్నారనే విషయాన్ని మంత్రి నాగార్జున గుర్తు చేశారన్నారు. కానీ ఆ సమయంలో సభలో సీఎం ఉన్నాడని టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి బుగ్గనరాజేందర్ నాథ్ రెడ్డి చెప్పారు.
also read:ఈఎస్ఐ స్కాం, రాజధానిపై చర్చకు రెడీ: బీఏసీ మీటింగ్ లో అచ్చెన్నాయుడికి జగన్ ఆఫర్
ఇదే విషయమై మంత్రి అంబటి రాంబాబు చర్చలో జోక్యం చేసుకున్నారు. కౌరవ సైన్యమని టీడీపీ ఎమ్మెల్యే స్వామి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. మీ సైన్యాధ్యక్షుడు పారిపోయాడని పరోక్షంగా చంద్రబాబుపై సెటైర్లు వేశారు వాళ్లు వీళ్లు రాజీనామా చేయడం ఎందుకు కుప్పంలో చంద్రబాబు రాజీనామా చేసి గెలవాలని ఆయన సవాల్ విసిరారు. రెచ్చగొట్టేలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతున్నారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు.