రైతులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు: గోరంట్ల విమర్శలు

By narsimha lodeFirst Published Nov 30, 2020, 3:56 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుండి చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలను  ఒక్కరోజు పాటు సస్పెన్షన్ విధించారు. సస్పెన్షన్ విధించిన సభ్యులను మార్షల్స్ అసెంబ్లీ నుండి బయటకు తరలిస్తున్నారు.

అమరావతి: రైతులను ప్రభుత్వం ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు.

సోమవారం నాడు అసెంబ్లీ నుండి టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెన్షన్ గురైన తర్వాత టీడీపీ ఎమ్మెల్యే  గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడారు. ప్రతిపక్షాలను తిట్టడమే పనిగా ప్రభుత్వం పనిగా పెట్టుకొందన్నారు. 

also read:పంట నష్టంపై అసెంబ్లీలో నిరసన: చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

రైతుల సమస్యపై మాట్లాడుతామంటే మైక్ ఇవ్వలేదన్నారు.  ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావాలి.. కానీ ఎందుకు ఆలస్యంగా సమావేశాలను ప్రారంభించారో చెప్పాల్సిందిగా కోరారు. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే హౌస్ నడవాలా అని ఆయన ప్రశ్నించారు. 

ధాన్యం ధర కూడా చెల్లించలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన ఆరోపించారు. సుధీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబును కూడా సస్పెండ్ చేశారని ఆయన చెప్పారు. సభ సంప్రదాయాలను మంట కలుపుతున్నారని ఆయన మండిపడ్డారు.

అధికారం శాశ్వతం కాదని ఆయన వైసీపీకి హితవు పలికారు. పోలవరం ఎత్తు తగ్గిస్తోంటే అడగలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆయన చెప్పారు.

click me!